చెన్నై:వరాలిచ్చే మహాలక్ష్మి మమ్మల్ని చల్లగా చూసి.. వరాలు ఇమ్మని వేడుకుంటూ వరలక్ష్మీపూజను వైభవోపేతంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా తెలుగు పారిశ్రామికవేత్త, ఐకాస్ టెక్నాలజీస్ ప్రయివేటు లిమిటెడ్ డైరెక్టర్ శ్రీమతి శోభారాజా నేతృత్వంలో అన్నానగర్లోని వైకుంఠ నిలయంలో శుక్రవారం రాత్రి శ్రీ వరలక్ష్మి పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు . ముఖ్యఅతిథిగా సీనియర్ సినీ నటి జయచిత్ర పాల్గొని వరలక్ష్మీ అమ్మవారి సేవలో తరించారు

వివిధ రకాల పుష్పాలతో వరలక్ష్మి అమ్మవారిని నేత్రపర్వంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ పూజల్లో పెద్ద సంఖ్యలో తెలుగు మహిళలు పాల్గొని వరలక్ష్మీ అమ్మవారిని వేడుకున్నారు. పూజల్లో పాల్గొన్న వారందరికీ తాంబూలం, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శోభా రాజా మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా శ్రీ వరలక్ష్మీ పూజలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో గతంలో సినీ నటి, మాజీ మంత్రి రోజా, గాన సరస్వతి సుశీలమ్మ,నటి నిరోషా పాల్గొన్నారని, ప్రస్తుతం సినీయర్ సినీనటి జయచిత్ర పాల్గొనడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు . సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పది కాలాల పాటు సుమంగళిగా ఉండే విధంగా వరలక్ష్మీ అమ్మవారిని వేడుకున్నామన్నామని తెలిపారు. ఈ వేడుకలో శోభారాజా కుటుంబసభ్యులతోపాటు టివీ ఆర్టిస్టు లత,సెందమిళ్ అరసు టీవి న్యూస్ రీడర్ , తెలుగు ప్రముఖులు దేవరకొండ రాజు, ఆలిండియా రేడియో గజగౌరి, అన్నపూర్ణ, మణిమాల, గాయని అరుణాశ్రీనాధ్ విశ్రాంత తెలుగు ఆచార్యులు మనోజ గారు,నిర్మలా పళనివేలు ,ఉషారాణి తదితరులు పాల్గొని వరలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.


More Stories
SRIHER STUDENT SETS A WORLD RECORD‘PUSHING A CAR FOR GREATEST DISTANCE FOR ONE HOUR’
Shree Jain Medical Relief Society Marks 75 Years of Service to Mankind
இளைஞர்களிடையே இணையவழி துஷ்பிரயோகம், பாலியல் சுரண்டல் மற்றும் மனிதக் கடத்தல் குறித்த விழிப்புணர்வு