September 20, 2024

కనులపండువుగా ….దీపోత్సవం -2024

చెన్నైన్యూస్: అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని మద్రాస్ హైకోర్టు న్యాయవాదిగా సేవలందిస్తున్న సమాజ సేవకులు హిందు యువ సంఘథాన్ వ్యవస్థాపకులు యష్ దహిమా , వారి మిత్రబృందం కలసి జనవరి 22 వ తేదీ సోమవారం
300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రాంగణంలో ఉన్న కన్వెన్షన్ సెంటర్ వద్ద దీపోత్సవం 2024 పేరుతో నిర్వహించిన కార్యక్రమం కనుల పండువుగా నిలిచింది .జై శ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ తమిళం, హిందీ భాషల్లో చిత్రీకరించిన ఆకృతులలో దీపాలను వెలిగించి శ్రీరామునికి దీప కాంతులతో నిరాజనాల పలికారు.అయోధ్య రామాలయం ను చిత్రించి దాని చుట్టూ దీపాలు వెలిగించటం ప్రత్యేకంగా నిలిచింది. దాదాపు 2100 పైగా దీపాలను వెలిగించి తమదైన భక్తి భావాన్ని చాటుకున్న యాష్ మిత్రబృందాన్ని పలువురు ప్రశంసించారు.అంతేకాకుండా శ్రీ కన్యకా పరమేశ్వరి రాజగోపురాన్ని సైతం విద్యుత్ దీప కాంతులతో నింపడంతో ఆలయానికి వచ్చిన భక్తులను సైతం కనువిందు చేసింది. ఇప్పటికే యాష్ , వారి స్నేహితుల బృందంతో కలిసి వివిధ మతపరమైన పండుగలను జరుపుకోవడానికి హిందూ యువ సంఘథాన్ ఏర్పాటు రెండు నెలలకు ఒకసారి వివిధ అనాథ, వృద్ధాశ్రమాలకు ఆహారాన్ని విరాళంగా అందిస్తున్నారు.
అలాగే శ్రీ కన్యకా పరమేశ్వరీ మహిళా కళాశాలలో అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్టాను పురస్కరించుకుని శ్రీ సీతారాములకు విశేషంగా పూజలు చేశారు. రాముని నామము జపించడం , రాముని పాటలు పాడుతూ సీతారాములను స్మరించుకున్నారు.ఈ పూజా కార్యక్రమంలో కళాశాల కరచాలకులు ఊటుకూరు శరత్ కుమార్ , ప్రధాన ఆచార్యులు డాక్టర్ .టి.మోహనశ్రీ , డీన్ డాక్టర్ .పి.బి.వనిత , విద్యార్థినిలు పాల్గోని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

About Author