September 20, 2024

తెలుగు శాఖ సాహితీ సేవలు అమోఘం–జె ఎం నాయుడు ప్రశంసల వర్షం

చెన్నై న్యూస్ : మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల ధర్మనిధి ఉపన్యాసాలు మంగళవారం ఘనంగా ప్రారంభమైయ్యాయి ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం ఆరు ధర్మనిధి ఉపన్యాసాలు జరుగనుండగా మంగళవారం ఉదయం ప్రారంభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి డా. పాండురంగం కాళియప్ప స్వాగతం పలకగా, సభాధ్యక్షులుగా తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు మాట్లాడుతూ వైవిధ్యమైన కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా ఈ ధర్మనిధి ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా మొత్తం ఆరు ధర్మనిధి ఉపన్యాసాలు అందులోను మూడు ఈ శాఖ ఆచార్యులదే కావడం మరో విశేషం అన్నారు. మరో మూడు తెలుగుభాషా సేవకుల శ్రేయోభిలాషులు ఏర్పాటు చేశారని, ఇలాంటి కార్యక్రమాలు విశిష్టమైనవిగాను, ఇవి సాధారణ సదస్సులకంటే విభిన్నమైనదన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జె.ఎం. నాయుడు తెలుగు శాఖ కార్యక్రమాలను ప్రశంసిస్తూ విద్యార్థులకు ఎంతో ప్రయోజకరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న తెలుగుశాఖకు తన సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయని హామీఇచ్చారు.ఈ సంవత్సరం నుండి తెలుగుశాఖలో పరిశోధన చేసే పిహెచ్.డి. విద్యార్థులకు ఆర్థిక సహాయం కూడా అందిస్తామని తెలిపారు. ఇదే కార్యక్రమంలో పూర్వం జరిగిన ధర్మనిధి ఉపన్యాసాల సంకలనాలను ఆవిష్కరించి, వాటి రూపకల్పన చేసిన ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ ను అభినందించారు. అంతేకాక జాతీయ స్థాయిలో ధర్మనిధి ఉపన్యాసాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆచార్య విస్తాలి శంకరరావుగారికే సాధ్యం అని ప్రశంసించారు.ధర్మనిధి ఉపన్యాస సంకలనాల తొలిప్రతిని స్వీకరించిన డాక్టర్ గంధం మహేంద్ర, గంధం అప్పారావు కుమార్తె సంఘమిత్ర మాట్లాడుతూ తమ తండ్రి ఆశయాలకు అనుగుణంగా వారి పేరుతో నిర్వహిస్తున్న ఈ ధర్మనిధి ఉపన్యాసాలు భావితరాల వారికి మానవత్వపు విలువలను పెంపొందింప చేసే విధంగా ఉంటాయని పేర్కొన్నారు.
అలాగే ప్రత్యేక అతిథిగా విచ్చేసిన రసమయి గ్రంథ రచయిత డా. ప్రణవి మాట్లాడుతూ విశిష్ట కార్యక్రమాలు చేపడుతున్న విస్తాలి వారి సేవ అభినందనీయం అని పేర్కొన్నారు. తన రచన ‘రసమయి’ అనే గ్రంథాన్ని ఆవిష్కరించి, ఆచార్య విస్తాలి శంకరరావుకు అంకితం ఇచ్చి వారిని తమ అల్లుడుగా పేర్కొన్నారు.ధర్మనిధి ఉపన్యాసాల ప్రారంభోపన్యాసంలో భాగంగా రచయిత్రి డా. ఆముక్తమాల్యద మాట్లాడుతూ తెలుగుశాఖ చేసే కార్యక్రమ విశిష్టతలను, ధర్మనిధి ఉపన్యాసాల ఆవశ్యకతను, ధర్మనిధి ఉపన్యాసాల ప్రత్యేకతను ఈ ధర్మనిధి ఉపన్యాసాల వలన భావితరాలవారు, సాహితీవేత్తల సేవలను వారి పేరు మీదుగా విజ్ఞానాన్ని అందరికీ అందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు.ధర్మనిధి ఉపన్యాసాల సంకలనకర్త ఆచార్య మాడభూషి సంపత్కుమార్ మాట్లాడుతూ ధర్మనిధి ఉపన్యాసాలు తెలుగుశాఖకు ప్రత్యేకమైన ఆకర్షణగాను, ఈ శాఖలో మొదటగా ఆర్కాటు ప్రకాశరావు, ఆచార్య గంధం అప్పారావు ధర్మనిధి ఉపన్యాసాలు ప్రారంభించడం జరిగింది. వారి పేరుతో గతంలో జరిగిన ఉపన్యాసాలను సంకలనం రూపంలో తీసుకురావడం, ఆ గ్రంథాలను ఈ వేదికపై ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. చివరగా డా. మాదా శంకరబాబు గారు వందన సమర్పణ చేశారు.ఇందులో టి ఆర్ ఎస్ శర్మ, డాక్టర్ ఏ వీ శివకుమారి, మురళి, అంబ్రూణి, ఎల్ బి శంకర రావు తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు సమావేశాల్లో పలువురు మాట్లాడారు.రేపు మొత్తం మూడు ధర్మనిధి ఉపన్యాసాలు కొనసాగుతాయి. అందులో భాగంగా ఎన్.ఆర్.చందూర్ స్మారక ధర్మనిధి ఉపన్యాసం, ములుమూడి ఆదిలక్ష్మి ధర్మనిధి ఉపన్యాసం, ఆచార్య జి.వి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి ధర్మనిధి ఉ పన్యాసంతో పాటు ముగింపు సమావేశం జరగనుంది.రేపు బుధవారం
మొత్తం మూడు ధర్మనిధి ఉపన్యాసాలు కొనసాగుతాయి. అందులో భాగంగా ఎన్.ఆర్.చందూర్ స్మారక ధర్మనిధి ఉపన్యాసం, ములుమూడి ఆదిలక్ష్మి ధర్మనిధి ఉపన్యాసం, ఆచార్య జి.వి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి ధర్మనిధి ఉపన్యాసంతో పాటు ముగింపు సమావేశం జరగనుంది.

About Author