September 20, 2024

భక్తులను సేవిస్తే…భగవంతున్ని సేవించినట్టే- కెవి రమణ శెట్టి వ్యాఖ్య


చెన్నై న్యూస్: భక్తులను సేవిస్తే… భగవంతున్ని సేవించినట్లేననీ జి కే శెట్టి బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కెవి రమణ శెట్టి అన్నారు. చెన్నైతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్యవైశ్య ప్రముఖుల అతిధేయ కమిటీ ఆధ్వర్యంలో అయోధ్య రామ జన్మభూమి రామలల్ల ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా అయోధ్య సందర్శించిన భక్తులకు జనవరి 19 నుంచి 33 రోజులపాటు ప్రతిరోజు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల దాకా నిరవధిక అన్నదానం నిర్వహించిన చెన్నైకు చెందిన అయోధ్య ఆర్యవైశ్య చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్టీ, ఎస్ వి ఎ సి ఫౌండేషన్ ప్రెసిడెంట్ కె రవికుమార్ ,దక్షిణ భారత వంటకాలు తయారు చేసిన కార్తీక్ టిఫిన్ సెంటర్ అధినేత డి రవిచంద్రన్ లకు అభినందన సమావేశం ఆదివారం చెన్నై చెట్ పేటీలోని అన్న లక్ష్మీ హోటల్లో వైభవంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కె వి రమణ శెట్టి జ్యోతి వెలిగించి కార్యక్రమానికి ప్రారంభించారు. అనంతరం అంకితభావంతో అన్నదానం నిర్వహించిన రవికుమార్, రవిచంద్రన్ లతో పాటు వాలంటీర్లు, వంటవారిని ఘనంగా సత్కరించారు.అలాగే నిర్వాహకులు కళాకారులను గౌరవించారు.అతిదేయ కమిటీ నిర్వహకులు, జిఆర్ టీ గ్రూపు సంస్థల అధినేత జి రాజేంద్రన్, జి కస్తూరిరంగంలు స్వాగతం పలికారు. ఆర్గనైజర్లు సీ రంగనాథం శెట్టి, ఎం జగదీష్ బాబు లు అయోధ్య అన్నదాన వివరాలను సభకు తెలియజేశారు.తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఆర్ రామ సుబ్రహ్మణి, ఎస్ సాయిరాం తదితరులు సత్కార గ్రహీతలను అభినందించారు. ఆర్గనైజర్ హరి రామ్ ప్రశాంత్ వందన సమర్పణ చేశారు. ముందుగా అరుణోదయం ప్రత్యేక ప్రతిభావంతుల నృత్య ప్రదర్శన అలరించింది. ప్రముఖ ఉపన్యాసకులు నాగై మురళీధరన్ రామావతారం గురించిన విశేషాలను విశిష్టతలను తెలిపి ఆకట్టుకున్నారు.
సత్కార గ్రహీతలు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ సమిష్టి కృషి ఫలితమే అన్నదాన కార్యక్రమం విజయవంతం అయిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోపురం కుంకుమం సంస్థ అధినేత వైవి హరికృష్ణ ,అజంతా గ్రూప్ అధినేత అజంతా డాక్టర్ కే శంకర్రావు, వైస్ ఫెడరేషన్ కార్యదర్శి పువ్వాడ శేషాద్రి, అపోలో సుబ్రహ్మణ్యం, జెమిని టింబర్ అధినేత సుబ్బారావు, అన్నానగర్ ఆర్యవైశ్య సంఘం కు చెందిన కాశీ విశ్వనాధం, విఎన్ హరినాధ్, ఎం వి నారాయణ గుప్తా, ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ కె ఎన్ సురేష్ బాబు , విల్లివాక్కం బాలాజీ ,ఎస్ కె పి డి ట్రస్టీలు , ఆర్యవైశ్య సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు.

About Author