November 22, 2024

టామ్స్ సౌత్ చెన్నై జిల్లా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

చెన్నై న్యూస్ : తమిళనాడు ఆది ఆంధ్ర అరుంధతీయ మహాసభ (టామ్స్) సౌత్ చెన్నై జిల్లా విభాగం ఆధ్వర్యంలో చెన్నై పల్లికరణై లోని మయిలై బాలాజీ నగర్ లో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా
జరుపుకున్నారు. మంగళవారం ఏర్పాటు అయిన ఈ వేడుకలకు టామ్స్ సౌత్ చెన్నై జిల్లా అధ్యక్షులు రొడ్డా జయరాజ్ అధ్యక్షత వహించారు.
ముఖ్యఅతిధులుగా టామ్స్ వ్యవస్థాపకులు
గొల్లపల్లి ఇజ్రాయిల్,టామ్స్ రాష్ట్ర అధ్యక్షులు నేలటూరి విజయ్ కుమార్ ,మడిపాక్కం 188 డివిజన్ కార్యదర్శి వి రంజిత్ కుమార్, 188 వార్డు కౌన్సిలర్ సెమీనా సెల్వం లు పాల్గొని ఉగాది వేడుకలను ఆరంభించారు.ఈ సందర్భంగా పేద మహిళలు 100 మందికి చీరలు, 50 మందికి బక్కెట్ లను వితరణ చేశారు. ఉగాదిని పురస్కరించుకుని చిన్నారులకు వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందించారు. అనంతరం గొల్లపల్లి ఇశ్రాయేలు మాట్లాడుతూ ఉగాది వేడుకలను గ్రామస్తులంతా కలసి మెలసి ఎంతో సంబరంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు . శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రతీ ఒక్కరూ సంతోషంగా జీవించాలని , ఆది ఆంధ్ర అరుంధతీయులు అంతా విద్యతో పాటు ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.3 శాతం రిజర్వేషన్ ను టామ్స్ సాధించి పెట్టడం వల్ల అనేకమంది ఆదిఆంధ్ర అరుంధతీయ విద్యార్థులు గొప్ప గొప్ప చదువులు చదివేందుకు ఆస్కారం లభించిందని ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేసి దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టామ్స్ రాష్ట్ర అధ్యక్షులు నేలటూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉగాది వేడుకలను చాలా చక్కగా నిర్వహించిన టామ్స్ సౌత్ చెన్నై జిల్లా అధ్యక్షులు రొడ్డా జయరాజ్ తో పాటు బాలాజీ నగర్ టామ్స్ నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టామ్స్ మయిలై బాలాజీ నగర్ శాఖ అధ్యక్షులు భూలోక పెంచలయ్య, సెక్రటరీ చెంచల తిరుపాల్ తో పాటు జంగం సుబ్రమణి , తాల్లూరి సుబ్బయ్య, ఇలారి దేవదాస్ , నల్లిపోగు విజయకుమార్ ,కావలి వెంకటరవణయ్య,
పట్ర ఆరోగ్య దాస్, గొలపల్లి ఆజరత్తయ్య, నారిపోగు డానియేల్ , నాగిల్ల వెంకట రావు,
నల్లిపోగు నేహెమియా తదితరులు పాల్గొన్నారు
.ఉగాది వేడుకల్లో పాల్గొన్నవారికి ఉగాది పచ్చడి తో పాటు స్వీట్లు పంచి పెట్టారు.

About Author