September 20, 2024

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

చెన్నైలో ప్రస్తుతం భానుడి ప్రతాపం 40 డిగ్రీలు దాటింది.మనుషులతో పాటు పశు పక్షాదులు సైతం ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో కొంత ఉపశమనం కోసం ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ (వామ్) గ్లోబల్ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ ఆధ్వర్యంలో చిక్కటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవం ఏప్రిల్ 13 వ తేదీ శనివారం ఉదయం ఘనంగా జరిగింది.దీనికి ముఖ్య అతిధిగా హైదరాబాద్ కు చెందిన వామ్ గ్లోబల్ లీడర్ బండారు సుబ్బారావు సతీసమేతంగా విచ్చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వృద్ద్దులు , కూలీ కార్మికులు, చిన్నారులు, మహిళలు, ఆటో డ్రైవర్లు, వాహనదారులు , రోడ్డున వెళ్లే పాదచారులు సుమారు 4వేల మందికి పైగా మజ్జిగ స్వీకరించి సంతోషించారు.ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న చెన్నైకు చెందిన వామ్ లీడర్ బెల్లంకొండ శివ ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు శ్రీలత ఉపేంద్ర, తంగుటూరి రమాదేవి రామకృష్ణ, వామ్ పిఆర్వో పేర్ల బద్రినారాయణ, రాధాకృష్ణ, బొగ్గారపు ప్రసాద్ , కస్టమ్స్ అసిస్టెంట్ కమీషనర్ – చెన్నై వై.విజయమూర్తి ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ దేశ విదేశాల్లో ఉన్నటువంటి వామ్ విభాగాలు అన్నీ ప్రజలకు వేసవి తాపం తీర్చే విధంగా మజ్జిగ, తాగునీటి చాలివేంద్రం వంటివి ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు . ఏ ఏ ప్రాంతాల్లో చాలివేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ వివరాలను గ్లోబల్ ఆఫీసుకు పంపించాలి అని కోరారు. మజ్జిగ ,తాగు నీటి వితరణ కార్యక్రమాలు వేసవికాలం ముగిసే వరకు ఉంటాయని ఈ సందర్భంగా రామకృష్ణ తెలిపారు. పశుపక్షాదులు, మూగ జీవుల దాహార్తిని తీర్చేందుకు రోడ్డు సైడ్ నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నామని ,మూగ జీవాల కోసం ప్రతీ ఒక్కరూ నీటి బక్కెట్ లను ఉంచాలని కోరారు. పూజలు, పునస్కారాలు చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో మూగజీవాలకు సేవ చేస్తే కూడా అంతే పుణ్యఫలం లభిస్తుందని అన్నారు. అలాగే ఎంతో ఉత్సాహంతో వివిధ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తంగుటూరి రామకృష్ణ కు అతిధులుగా పాల్గొన్న బండారు సుబ్బారావు , వై. విజయమూర్తి లు అభినందించారు.

About Author