December 23, 2024

వైభవంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాసవీ వసంతోత్సవాలు

చెన్నై న్యూస్: చెన్నై జార్జిటౌన్ లోని 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాసవీ వసంతోత్సవాలు ఏప్రిల్ 29 వ తేదీ సోమవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి అభిషేకాలు కనుల పండువుగా నిర్వహించారు.తొలిరోజు ఉత్సవమూర్తిని దంతపు పల్లకిపై కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు.సోమవారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో శ్రీ వాసవి స్తోత్ర రంజని సభ్యుల బృంద గానం తో అలరించారు. సోమవారం జరిగిన ఉత్సవానికి నగర ఆర్యవైశ్య పరిచా0రకులు ఉభయదారులుగా వ్యవహరించారు. అలాగే వసంతోత్సవంలో రెండువ రోజైన ఏప్రిల్ 30 వ తేదీ మంగళవారం శ్రీ వాసవి అమ్మవారు సింహ వాహనంపై మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులను తన చల్లని చూపుతో కటాక్షించారు .ఈ సందర్భంగా ఆలయం లోపల ప్రాకారంలో శ్రీ వాసవి అమ్మవారిని ఊరేగించారు.ఊరేగింపు వెంట భక్తులు ముందుకు సాగుతూ జై వాసవీ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది.
ఈ వేడుకల్లో ఆలయ పాలక మండలి సభ్యులతో పాటు, SKPD చారిటీస్ సెక్రెటరీ , పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ వాసవీ మాత కృపకు పాత్రులయ్యారు. మంగళవారం జరిగిన సాంస్కృతి కార్యక్రమంలో లలిత సహస్రనామ పారాయణం బృందం భక్తి గీతాలు ఆలపించి వీణులవిందు చేశారు .మంగళవారం జరిగిన ఉత్సవానికి నగర ఆర్యవైశ్య ఉమ్మిడి శెట్టులు ఉభయదారులుగా వ్యవహరించారు.
….

About Author