November 22, 2024

విద్యార్థులు గొప్ప విద్యావంతులు కావాలి- ఎం వి కన్నయ్య శెట్టి

చెన్నై న్యూస్:విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్ లో గొప్ప విద్యావంతులుగా ఎదగాలి అని ధర్మమూర్తి రావు బహదూర్ కలవల కన్నన్ శెట్టీస్ చారిటీస్ మేనేజింగ్ ట్రస్టీ కన్నయ్య శెట్టి వ్యాఖ్యానించారు.. దివంగత మాజీ ముఖ్యమంత్రి , విద్యా ప్రదాత కామరాజర్ 122వ జయంతిని విద్యాభివృద్ధి దినంగా చెన్నై నగరంలోని కె టి సి టి – ఎస్ కె పి డి పాఠశాలలు సంయుక్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించాయి.చెన్నై జార్జి టౌన్ లో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం కన్వెన్షన్ సెంటర్ వేదికగా పాఠశాలల కరస్పాండెంట్ సోలేటి లోకయ్యన్ సుదర్శనం అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కామరాజర్ చిత్ర పటానికి ముఖ్య అతిథి కన్నయ్య శెట్టి తోపాటు నిర్వాహకులు కలసి
పుష్పాంజలి ఘటించారు.ముఖ్య అతిథిని ఎస్ కె పి డి బాలుర మహోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లీలారాణి సభకు పరిచయం చేశారు. పాఠశాలల కరస్పాండెంట్ సోలేటి లోకయ్యన్ సుదర్శనం స్వాగతోపన్యాసం చేసి మహనీయులు కామరాజర్ ను స్పూర్తితో విద్యలో రాణించాలని విద్యార్థులకు హితవుపలికారు.అలాగే ఎస్ కె పి డి ట్రస్టీలు ఊటుకూరి శరత్ కుమార్, దేసు లక్ష్మీ నారాయణ, ఎస్ కె పీ సి ప్రిన్సిపాల్ డాక్టర్ టి మోహన శ్రీ కలసి అతిధులను ఘనంగా సత్కరించారు. ఎస్ కె పి డి , కె టి సి టి పాఠశాలల్లో గల తెలుగు, ఇంగ్లీషు, తమిళ భాషల సాంస్కృతిక సంఘాల ప్రారంభోత్సవం ను ముఖ్య అతిధి కన్నయ్య శెట్టి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. కామరాజర్ జయంతి సందర్భంగా 6 నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన పలు రకాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు.వందన సమర్పణను కె టి సి టి బాలికల మహోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిల చేశారు. ముందుగా కల్వి వలర్చి నాళ్ గురించి తమిళంలో ఎస్ కె పి డి విద్యార్థి, ఆంగ్లంలో కె టి సి టి విద్యార్థిని చక్కగా మాట్లాడగా, నేల తల్లికి వందనం అంటూ విద్యార్థినిలు తెలుగులో పాటను పాడి ఆకట్టుకున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ ఏవి శివకుమారి విచ్చేసి పాఠశాలలో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
..
..

About Author