చెన్నైన్యూస్:అనాథలు,అభాగ్యులు,నిరుపేద వృద్దులకు మానవత్వంతో సాయం చేసేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని గ్రేటర్ చెన్నై పోలీసు జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీసు కయల్ విళి అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సౌత్ సిటీ 324ఎం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ ఏ వి శివకుమారి తండ్రి , కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ అధికారి ,సమాజ సేవకులు దివంగత ఆలూరి రామస్వామి 16వ వర్థంతిని చెన్నై కోడంబాక్కం,అజీజ్ నగర్‌లో ఉన్న అన్నై ఉల్లం అనాథ వృద్దాశ్రమంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు.
డాక్టర్ శివకుమారి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా జాయింట్ పోలీసు కమీషనర్ కయల్ విళి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వృద్దులతో కాసేపు సరదాగా ముచ్చటించి వారి భాగోగులకు అడిగి తెలుసుకున్నారు.ఆరోగ్యంగా, సంతోషంగా గడపాలని వృద్దులకు సూచించారు. అనంతరం వృద్దులకు ఆమె చేతుల మీదుగా ఉదయం టిఫిన్ అందించారు.అనంతరం డాక్టర్ ఏవి శివకుమారి మాట్లాడుతూ వృద్దులకు సాయం అందించేలా తాను అనేక సేవాకార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. తన తండ్రి జ్ఞాపకర్ధం గత కొన్ని సంవత్సరాలుగా అన్నై ఉల్లంలో అనాధ వృద్దులకు తనవంతుగా సాయం నదిస్తున్నట్టు తెలిపారు.అనేక మంది పేద విద్యార్థులకు చేయుత నిస్తున్నట్టు చెప్పారు. 16వ వర్ధంతి సందర్భంగా మంగళవారంఉదయం అల్పాహారం, మద్యాహ్నాం బోజనం, రాత్రి టిఫిన్‌ని అందించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్స్ ఫరీదా సెయింట్, లయన్ కళామతి , లయన్ రాథారాణి ,లయన్ గీతాకన్నన్, లయన్స్ రుక్మిణి, లయన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీసు కయల్ విళి ని డాక్టర్ ఏ వి శివకుమారి ఘనంగా సత్కరించారు.
…
More Stories
Chennai Half Marathon 2024 receives over 6000 entries
அகத்தியர் லோப முத்ரா சிலைகள் பழமையான சிவன் ஆலயத்திற்கு நன்கொடை
ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా వైభవంగా గోపూజ