September 19, 2024

శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అత్యంత వైభవంగా ఆడి కృతిక ఉత్సవం

చెన్నై న్యూస్ : బంగారు నెమలి వాహనంపై వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి విహరిస్తూ భక్తులను కటాక్షించారు. చెన్నై జార్జి టౌన్ లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆడికృతిక మహోత్సవ వేడుకలను సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు భాస్కర పంతులు బృందం నేతృత్వంలో ఉదయం శ్రీ వాసవాంబకు ,వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి విశేష పూజలు ,అభిషేకాలు ,అలంకారం , అర్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

సోమవారం రాత్రి 6 గంటలకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కీర్తిస్తూ
చెన్నై కి చెందిన టి.ఎస్. పార్థసారథి బృందం
భక్తి గీతాలు శ్రావ్యంగా అలపించి ఆధ్యాత్మిక శోభను తెచ్చారు.ఆడికృతిక ఉత్సవం లో భాగంగా రాత్రి 7:30 గంటలకు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని బంగారు నెమలి వాహనంపై కొలువు తీర్చి విశేష పూజలను నిర్వహించారు . అనంతరం ఆలయం ప్రాంగణంలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని ఊరేగించారు.ఇందులో ఆలయ సిబ్బంది , ట్రస్టీలు , సెక్రటరీ లు ఊరేగింపులో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.శ్రీ సుబ్రమణ్య స్వామి ,శ్రీ వాసవీ అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఉద్యోగులు, ఎస్ కే పి డి చారిటీస్ నిర్వాహకులు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆడి కృతిక ఉత్సవం విజయవంతంగా సాగింది. భక్తులు , ఎస్ కె పి డి హాస్టల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ సిబ్బందిని, ట్రస్టీ లను తగురీతిలో గౌరవించి, శ్రీ వాసవీ అమ్మవారి ఆశీస్సులు అందించి ప్రసాద వినియోగం చేశారు.

About Author