November 24, 2024

ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం…టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇశ్రాయేలు.

చెన్నై న్యూస్ : ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ఆది ఆంధ్ర అరుంధతీయ మహాసభ (టామ్స్) స్వాగతిస్తోందని ఆ సంస్థ వ్యవస్థాపకులు
గొల్లపల్లి ఇశ్రాయేలు అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం తాము చేసిన కృషికి విజయమిదని ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సీ ,ఎస్టీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును గురువారం వెల్లడించింది. ఎస్సీ ఉపవర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయ స్థానం తమ తీర్పులో చెప్పింది. దీంతో చెన్నై తో పాటు తమిళనాడు వ్యాప్తంగా దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం అహర్నిశలు పోరాటం చేస్తూ వచ్చిన టామ్స్ సంస్థ హర్షం వ్యక్తం చేసింది .ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందోత్సహాలల్లో మునిగిపోయారు. చెన్నై నుంగంబాకంలోని టామ్స్ ప్రధాన కార్యాలయం వేదికగా టామ్స్
సంస్థ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇ శ్రాయిల్ ,రాష్ట్ర అధ్యక్షులు నేలటూరి విజయ్ కుమార్ తో పాటు టామ్స్ నిర్వాహకులు పెద్ద ఎత్తున చేరుకొని సుప్రీంకోర్టు అందించిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా గొల్లపల్లి ఇశ్రాయేల్ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల కల ఈనాటికి నెరవేరిందని,ఇది తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.ఈ తీర్పుతో ఆది ఆంధ్ర అరుంధతీయుల జీవితాల్లో కొత్త వెలుగులు విరజిమ్ముతాయని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించటం తమకు మరోసారి స్వాతంత్ర్యం వచ్చినంత ఆనందంగా ఉందన్నారు.అప్పటి వన్ మ్యాన్ కమీషన్ చైర్మన్ జస్టీస్ ఎం ఎస్ జనార్దన్ గారికి , మాజీ గవర్నర్లు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, అప్పటి ఉపముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ లకు ఎస్సీ వర్గీకరణ గురించి విన్నవించామని గుర్తు చేశారు.రిజర్వేషన్ సాధనలో
టామ్స్ కృషి ఎక్కువగా ఉందని పేర్కొంటూ
తమిళనాడు రాష్ట్రంలో ఆది ఆంధ్ర అరుంధతి ప్రజలకు 3 శాతం రిజర్వేషన్ అందించిన కరుణానిధికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. తండ్రిబాటలో నడుస్తున్న సీఎం స్టాలిన్ కు ధన్యవాదాలు తెలిపారు
ఇందులో టామ్స్ కు చెందిన వి.దేవదానం, .
స్వర్ణ జయపాల్, బి ఎన్ బాలాజీ, వేళచ్చేరి రొడ్డా జయరాజ్ , అద్దంకి ఐసయ్య , సి హెచ్ తిరుమల రావు ,పాల్ కొండయ్య, రోశయ్య తదితరులు సైతం సుప్రీం తీర్పు పై హర్షం వ్యక్తం చేశారు.టామ్స్ కృషిని అభినందిస్తూ పలువురు నేతలు, తెలుగు సంఘాల నాయకులు ప్రశంసించారు.

.

About Author