December 25, 2024

సెయింట్ థామస్ మౌంట్, నజరత్ పురంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం

చెన్నై న్యూస్ :సెయింట్ థామస్ మౌంట్, నజరత్ పురం ఆది ఆంధ్ర అరుంధతీయుల సంక్షేమ సంఘం తరపున శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వత్ర పూజలను వైభవంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు ఎయిర్ పోర్ట్ టి .ఎం. గోపి అధ్యక్షతన కార్యదర్శి ఎన్.రవి, కోశాధికారి వి.అశోక్ కుమార్ ల నేతృత్వంలో ఏర్పాటు అయిన ఈ కార్యక్రమంలో అతిధులుగా తమిళనాడు EB న్యాయశాఖ అదనపు కార్యదర్శి జీసీ నాగూర్ , టామ్స్ సౌత్ చెన్నై జిల్లా అధ్యక్షులు రొడ్డా జయరాజ్ లు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో సంఘం అదనపు ఉపాధ్యక్షులు తిరుపాల్ రావు, ఉపాధ్యక్షులు సూరిపోగు రంగయ్య, అదనపు కార్యదర్శి సి.వి.రజని, ఉప కార్యదర్శి ఎం.ఏ నరసయ్య, సంయుక్త కోశాధికారి వి.రాజేష్, సహాయక కోశాధికారి సి.హెచ్.రంజిత్ కుమార్, సలహాదారులు డీఎల్ ఆర్ రమేష్, సీహెచ్ పద్మయ్య , శ్రీదేవి మాతమ్మా ఆలయ ట్రస్ట్ అధ్యక్షురాలు కె.ఎన్.మహాలక్ష్మి, ఉప కార్యదర్శి తిరుపతి, సలహాదారులు సి హెచ్ నరసింహులు, గోవిందరాజ్, ఏ .పెంచలయ్య , సంఘం సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులందరికీ అన్నదానం చేశారు., శ్రీదేవి మాతమ్మా కు విశేష పూజలు చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

About Author