November 23, 2024

మద్రాస్‌ ఆది ఆంధ్ర అరుంధతీయ ఆదివాసీ సంక్షేమ సంఘం–చెన్నై(మాస్‌) 32వ ప్రతిభా అవార్డుల వేడుకలు–2024

చెన్నై న్యూస్:మద్రాస్‌ ఆది ఆంధ్ర అరుంధతీయ ఆదివాసీ సంక్షేమ సంఘం–చెన్నై (మాస్‌) 32వ ప్రతిభా అవార్డుల వేడుక–2024 ఘనంగా జరిగింది. చెన్నై పెరంబూర్‌ లోని డి ఆర్‌ బి సిసిసి పాఠశాల ప్రాంగణంలో మాస్‌ సంస్థ అధ్యక్షులు, శాస్త్రవేత్త డాక్టర్‌ కొల్లి రాజు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ ఆడిషనల్‌ కమీషనర్‌ డాక్టర్‌ వి.శ్రీధర్, ప్రత్యేక అతిథిగా అలేఖ్య లెదర్స్‌ అధినేత నర్రావుల వెంకట రమణ లు పాల్గొని 10వ తరగతి, ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన 60 మంది తెలుగు విద్యార్థిని విద్యార్థిలకు ప్రతిభా అవార్డు పేరుతో రూ.1,20,000 ప్రోత్సాహక నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు పేద విద్యార్థుల విధ్యాభివృద్దికి సహాయపడుత్ను మాస్‌ సేవలను అతిథులు కొనియాడారు. ఆత్మీయ అతిధులుగా తమిళనాడు ప్రభుత్వ లా విభాగం అదనపు కార్యదర్శి జి.సి.నాగూర్, తమిళనాడు ప్రభుత్వ అసిస్టెంట్‌ లేబర్‌ కమీషనర్‌ ఓ.జానకీరామ్, టాస్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ కె.ఎలిలన్, జనని కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, జెపిఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ డీన్‌ డాక్టర్‌ ఎం.ఎస్‌ విజయ్‌ రావు, మాస్‌ జాయింట్‌ సెక్రటరీ లు కేపి రావు, ఎస్.తిరుపతయ్య, పాల్ కొండయ్య, జాయింట్ ట్రెజరర్ దీనదయాలన్, ట్రెజరర్ మొలబంటి వీరయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజీవ్, ఉసురుపాటి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా అతిధులు, వక్తలు విద్యార్థులు కష్టపడి చదవి ఉన్నత స్థాయికి ఎదగాలని తమ విలువైన సూచనలు ఇచ్చారు. మాస్‌ ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి అజరత్తయ్య స్వాగతంపలికి ఏర్పాట్లు పర్యవేక్షించారు. మాస్‌ సంస్థ ఉపాధ్యక్షుడు నూనె శ్రీనివాసులు వందన సమర్పణతో వేడుక ముగిసింది.దాతలు సింగంశెట్టి అతీంద్రులు శెట్టి చారిటీస్, డి ఆర్ బి సి సి సి, కె జి సిద్దార్థ్, ఆల్బర్ట్ రావు, చెరుకూరి నాగార్జున రావు లకు మాస్ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొనగా దాదాపు 150 మందికి పైగా భోజనాలు అందించారు.


..

About Author