November 25, 2024

మానవాళి శ్రేయస్సు కోసమే వినూత్న అణు నిరోధక కవచ వ్యవస్థ – డాక్టర్ మిక్కిలి ప్రసన్న కుమార్

చెన్నై న్యూస్:ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ కేంద్రం శాస్త్రవేత్తల సహకారంలో మానవాళి శ్రేయస్సు కోసం తమ సంస్థ రూపొందించిన వినూత్న అణు నిరోధక కవచ వ్యవస్థ విజయవంతమైందని హైదరాబాద్ కి చెందిన సిగ్మా-9 ఏరోస్పేస్ డిఫెన్స్ రీసెర్స్ సెంటర్ సీఎండి డాక్టర్ మిక్కిలి ప్రసన్న కుమార్ పేర్కొన్నారు.
చెన్నై ఎగ్మోర్ లోని ఓ నక్షత్ర హోటల్ వేదికగా
సిగ్మా-9 ఆధ్వర్యంలో టెక్నికల్ రీసెర్చ్ ఆన్ న్యూక్లియర్ షీల్డ్ ప్రాజెక్టు ప్రారంబోత్సవ కార్యక్రమం దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలు, నిపుణుల సమక్షంలో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా మిక్కిలి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ మహిళా సాధికారతతో తమ సంస్థ యాంటీ న్యూక్లియర్ షీల్డ్ టెక్నాలజీ అద్భుతమైన పురోగతి సాధించిందన్నారు.ఇది 15 యేళ్ళ కృషికి ఫలితమని పేర్కొన్నారు. దేశ భద్రతపై ప్రత్యేక దృష్టిసారించామని, తెలిపారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విపత్తులు నుంచి సమస్త మానవాళిని, జీవులను రక్షించే లక్ష్యంతో అధునాతన సెన్సార్లు, యాంటీ క్షిపణి గోడలను మిళితం చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సిగ్మా-9 అడ్వైజరీ బోర్డు చైర్మన్ డాక్టర్ మల్లిబాబు, ఇంకా శ్రీరామ చంద్రమూర్తి, సుబాష్ చంద్రబోస్, లెఫ్టినెంట్ కల్నల్ ముద్దా అబ్రహం లింకన్, డీఎంకే కొరట్టూర్ డివిజన్ డిప్యూటీ సెక్రటరీ చల్లగాలి యాకోబు ,గ్రేటర్ చెన్నై సీనియర్ రెవెన్యూ అధికారి ఎం.పి.తిరుపాల్ , సిగ్మా-9నిర్వాహకులు ఇందిరా, కీర్తి, రాధ, రాజేశ్వరి, కంచన్, తులసి, రమణి, శ్వేత, నవనీత, వాణి ,చరిత, సౌఖ్య తదితరులు పాల్గొన్నారు.

About Author