January 2, 2025

2025 నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ” ఫేస్ పెయింటింగ్ “

చెన్నై న్యూస్:2025 నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ చెన్నైలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల విద్యార్థినిలు ఫేస్ పెయింటింగ్ తో ఆకట్టుకున్నారు . డిసంబర్ 28వ తేదీ శనివారం ఉదయం కళాశాల ప్రాంగణంలో విద్యార్థినిలు నూతన సంవత్సరం సందర్భంగా పలు రకాల సందేశాలను వివరిస్తూ చేసిన ఫేస్ పెయింటింగ్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. .ఇందులో ప్రధానంగా మహిళలు, చిన్నారుల భద్రత, నీటిని పొదుపు చేయాలని, పక్షులను రక్షించాలని ,పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, మొక్కలు నాటాలని అలాగే ట్రాఫిక్ నిబంధనలను సక్రమంగా పాటించాలని పిలుపునిచ్చారు. విద్యార్థినిలు రంగురంగుల పెయింటింగ్ లతో కనువిందుచేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్ ,కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి మోహన్ పాల్గొని మాట్లాడుతూ 2025 కొత్త సంవత్సరం లో విద్యార్థినిలు కొత్త ఆశలతో, ఆకాంక్షలతో అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని ఆకాంక్షించారు.ఫేస్ పెయింటింగ్ లో పాల్గొన్న విద్యార్థినిలను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఇందులో డీన్ పి బి వనిత, అధ్యాపకులు లక్ష్మీ,డాక్టర్ పి ఎస్ మైథిలి , విద్యార్థినిలు పాల్గొన్నారు

About Author