చెన్నై న్యూస్:2025 నూతన సంవత్సరం ప్రతీ ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరు రామకృష్ణ ఆకాంక్షించారు. వామ్ గ్రేటర్ చెన్నై విభాగం ఆధ్వర్యంలో 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2025 వ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ వామ్ మహిళా విభాగం నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. స్థానిక చూలై మేడ్ లోని వామ్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం వినాయక పూజతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆటలు పాటలు, తంబోలా, లక్కీ డ్రిప్ , నృత్యాలతో పూజలతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళ విభాగం అధ్యక్షురాలు శ్రీలతఉపేంద్ర ఆధ్వర్యంలో వామ్ గ్లోబల్ ఫస్ట్ లేడీ తంగుటూరి రమాదేవి తో పాటు మహిళా విభాగం సెక్రెటరీ అరుణకుమారి తదితరులు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో అనేకమంది కొత్త సభ్యత్వం తీసుకున్నారు .అతిథులుగా తంగుటూరి రామకృష్ణ ,బెల్లంకొండ సాంబశివరావు పాల్గొన్నారు. అలాగే గ్రేట్ చెన్నై విభాగంలో కొత్తగా చేట్ పేట్ విభాగాన్ని ప్రారంభించారు. దీనికి అధ్యక్షులుగా జగదీష్ సింహం ,సెక్రటరీగా విగ్నేష్, ట్రెజరర్ గా సత్యనారాయణల చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ 2025 నూతన సంవత్సరం సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ప్రజలంతా జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా వామ్ తరపున సంక్రాంతి సంబరాలను భారీ ఎత్తున నిర్వహించనున్నట్టు తెలిపారు.వామ్ సీనియర్ సిటిజన్ ఫారమ్ కి చెందిన జి ,రాధాకృష్ణ, ముద్ర రమేష్ బాబు ,పురుషోత్తం, ప్రముఖ పారిశ్రామిక వేత్త శోభారాజా తదితరులు పాల్గొన్నారు
…
More Stories
జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వీరపాండ్య కట్టబొమ్మన్ -ఏఐటీఎఫ్ అధ్యక్షులు డాక్టర్ సిఎంకే రెడ్డి.
வீரபாண்டிய கட்டபொம்மன் அவர்களின் 265 வது பிறந்தநாள் விழா
సేవే పరమావధిగా సమాజానికి సేవ చేయండి..వాసవీ క్లబ్ లకు సుజాత రమేష్ బాబు పిలుపు