చెన్నై న్యూస్: తెలుగు భాషను మరువరాదని జనని సంస్థ ప్రదాన కార్యదర్శి గుడిమెట్ల
చెన్నయ్య పిలుపునిచ్చారు. 2025 నూతన సంవత్సరం సందర్భంగా తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘము (టిటిసిఏ) ఆధ్వర్యంలో నూతన సంవత్సర తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. సంఘము అధ్యక్షులు తమ్మినేని బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుడిమెట్ల చెన్నయ్య పాల్గొని 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
అనంతరం గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ తెలుగు భాషా పరిరక్షణ, వికాసానికి ఈ సంఘము చేస్తున్న కృషి ఎనలేనిదని అన్నారు. 48 ఏళ్లగా తెలుగు సాహితీ సేవలో పయనిస్తూ తెలుగు వారికి , తెలుగు భాషకి సేవలందించటం ముదావహం అని ప్రసంశించారు. తెలుగు భాషను మరువరాదని ఈ సందర్భంగా తెలుగు వారికి పిలుపు నిచ్చారు. సంఘము అధ్యక్షులు తమ్మినేని బాబు మాట్లాడుతూ గత 48 ఏళ్లుగా క్రమం తప్పకుండా తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరిస్తూ నగరంలోని తెలుగు వారందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలాగే సంఘం కార్యదర్శి పిఆర్ కేశవులు మాట్లాడుతూ తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘము సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. .గాయని నిడమర్తి వసుంధరాదేవి,తెలుగు భాషాభిమాని N.V.V. సారధి, ఇంకా సభ్యులకు తెలుగు క్యాలెండర్లను పంపిణీ చేశారు.
More Stories
Sundaram Finance Mylapore Festival 2025 to be held from January 9th – 12th
Gyan Babu and Senait Kefelegn win the Freshworks Chennai Men’s and Women’s Full Marathon 2025 powered by Chennai Runners
జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వీరపాండ్య కట్టబొమ్మన్ -ఏఐటీఎఫ్ అధ్యక్షులు డాక్టర్ సిఎంకే రెడ్డి.