January 15, 2025

ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని సాధన చేస్తే విజయం తథ్యం-ప్రముఖ ఆర్థో డెంటిస్ట్ డాక్టర్ ఎం ఎస్ రాణి

చెన్నై న్యూస్: ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని సాధన చేస్తే విజయం సొంతమవుతుందని కె టి సి టి పూర్వ విద్యార్థిని, ప్రముఖ ఆర్థో డెంటిస్ట్ డాక్టర్ ఎం ఎస్ రాణి పిలుపునిచ్చారు.శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం అండ్ చారిటీస్ యాజమాన్యంలో కొనసాగుతున్న కేటీసీటి ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల, కేటీసీటి బాలికల మహోన్నత పాఠశాలల వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. స్థానిక ప్యారీస్ లో ఉన్న కన్యకాపరమేశ్వరి కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎంఎస్ రాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా పదవ తరగతి , ప్లస్ టూ లో ప్రతిభను చాటుకున్న విద్యార్థినిలకు బహుమతులతో పాటు రోలింగ్ ట్రోఫీలు బహుకరించారు. ఆయా విభాగాల్లో రాణించిన చిన్నారులకు కూడా బహుమతులు అందించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ లక్ష్యాన్ని ఏర్పరచుకొని సాధన చేయగలిగితే ఎందులోనైనా విజయం సాధించగలరని ఆమె హితవు పలికారు.ముందుగా పాఠశాల కరస్పాండెంట్ ఎస్ఎల్ సుదర్శనం స్వాగతోపాన్యాసం చేశారు.ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఎస్ కె పి సి కరస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్ పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు.కేటీసీటి బాలికల మహోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. అనిల, కేటీసీటి ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చుక్కా రేవతిలు వార్షిక నివేదికలను చదివి వినిపించారు. అనంతరం ముఖ్య అతిథిని ఎం ఎస్ రాణిని ఘనంగా సత్కరించారు.వ్యాఖ్యాతగా ఎన్.శృతి , ముఖ్య అతిధిని మనోజ పరిచయం చేశారు.కార్యక్రమంలో భాగంగా కె టి సి టి పూర్వ విద్యార్థినిల సంఘం తరపున కూడా విద్యార్థులకు బహుమతులు అందించారు.చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.చివరిగా డాక్టర్ కోమల వందన సమర్పణ గావించారు.

About Author