చెన్నై ; తెలుగు భాష కమ్మదనాన్ని, తెలుగు భాష గొప్పతనాన్ని ,తెలుగు భాష అమృతాన్ని పదిమందికి పెంచాలన్న లక్ష్యంతో చెన్నైకి చెందిన తెలుగు వెలుగు సంక్షేమ సంఘం విశేషంగా కృషి చేస్తుంది .చెన్నైతోపాటు ఆంధ్ర రాష్ట్రంలోని పల్లె పల్లెలో మాతృభాష మమకారాన్ని తెలుపుతూ భాషా సేవలు తరిస్తూ తెలుగు వెలుగు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ ముందుకెళుతున్నారు.ఈ క్రమంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని తెలుగు వెలుగు సంస్థ తరపున అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఆంధ్ర -తమిళనాడు సరిహద్దు గ్రామాలైన కండ్రిగ, ఇచ్చాపుత్తూర్ లకు వెళ్లి చిన్నారులతో కలసి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. చిన్నారులకు తనవంతుగా సహాయం చేసి స్కూల్ బ్యాగ్ లు , పుస్తకాలు, టిఫిన్ బాక్స్ లు, వితరణ చేశారు.అలాగే పల్లెల్లో ఉచితంగా ట్యూషన్ లు చెబుతూ తన కు సహకరిస్తున్న రాధాకృష్ణన్, వెట్రివేల్ , గోమతి లను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.అక్కడ ఉన్న అయ్యప్ప ఆలయానికి తెలుగు వెలుగు తరపున సహయాన్ని అందించారు. ఈ సందర్భంగా అల్లింగం రాజశేఖర్ మాట్లాడుతూ మాతృభాషను పరిరక్షించడమే తమ లక్షమని అన్నారు.ఆ దిశగా గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు వెలుగు సంక్షేమ సంఘం తెలుగు భాష కోసం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థులలో తెలుగు భాష మమకారాన్ని పెంచే విధంగా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తున్నామని అన్నారు.
మాతృభాష సేవలో తరిస్తున్న తెలుగు వెలుగు సంస్థ

More Stories
Labor of Love: Farmer Sundar Raj’s Story of Devotion and Resilience
சட்ட மாமேதை டாக்டர் அம்பேத்கர் அவர்களின் 135வது பிறந்த நாளை முன்னிட்டு நாடு முழுவதும் மிகை எழுச்சியாக கொண்டாடப்பட்டது
தமிழ்நாடு வக்பு சொத்துக்களை காலக்கெடுவுக்குள் டிஜிட்டல் முறையில் அளவீடு செய்ய தமிழ் மாநில முஸ்லிம் லீக் வலியுறுத்தல்