March 7, 2026

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి స్పందన

చెన్నై న్యూస్:ప్రముఖ టాలీవుడ్ హీరో , సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా చెన్నై మహేష్ బాబు అభిమానులు,రాఘవ-జమునా ఛారిటబుల్ అండ్ ట్రస్ట్ ORG బ్లడ్ గ్రూప్ సంయుక్తంగా ఆదివారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. చెన్నై సెయింట్ థామస్ మౌంట్‌,నజరేత్ పురం గాంధీ గ్రౌండ్‌లోని నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. అభిమానులతో పాటు, నగరం నలుమూలల నుండి యువత రక్తదానం చేయడానికి వచ్చారు. ముఖ్యంగా, సూపర్ స్టార్ కృష్ణ మరియు ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు చాలా మంది ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం ద్వారా తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. చెన్నై మహేష్ బాబు అభిమానులు మరియు రాఘవ-జమునా ఛారిటబుల్ అండ్ ట్రస్ట్ ORG బ్లడ్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు కొనసాగింది. శిబిరంలో పాల్గొన్న రక్తదాతలకు పండ్లు, బిస్కెట్లు , సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా చెన్నై మహేష్ బాబు అభిమానులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మహేష్ బాబు పుట్టినరోజు మాకు పండుగ లాంటిది. ఆయన చాలా మంది పేదలకు సహాయం చేయడమే కాకుండా, ఉచిత గుండె శస్త్రచికిత్సలు కూడా చేయిస్తున్నారు అని , అనేక విధాలుగా తన దాతృత్వాన్ని చూపిస్తున్నారన్నారు. అలాంటి హీరో మహేష్ బాబు అభిమానులుగా ఉండటం మాకు గర్వకారణం అని అన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పేరుతో చెన్నై తో పాటు తమిళనాడు అంతటా విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. 4500 మంది పిల్లలు గుండె శస్త్రచికిత్సలు చేయించడం నిజంగా ప్రశంసనీయం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువత రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. చెన్నై మహేష్ బాబు అభిమానులు తిరుమలసెట్టి శివసాయి, ఉదయ్ కిరణ్, ఎం వసంత్, ఎ కిరణ్ కుమార్, ధనహరి, హర్ష, చైతన్య, హర్ష, అనంత్, శ్రీను, రాహుల్ , సాకేత్ రామ్, వర్మ, శ్రీహర్ష, లింగా బాబు, కెఎస్విఎస్ రాహుల్ , ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు

About Author