March 7, 2026

కలిసిఉందాం..కలుపుకుపోదాం-కాపు సేవా సమితి చెన్నై అధ్యక్షులు గూడపాటి జగన్మోహన్ రావు వ్యాఖ్య

చెన్నై న్యూస్:సమాజంలోని అన్ని సామాజిక వర్గాలతో కలసి మెలసి జీవించాల్సిన అవరసం ఎంతైనా ఉందని కాపు సేవా సమితి – చెన్నై అధ్యక్షులు గూడపాటి జగన్మోహన్ రావు అన్నారు. కలసి ఉందాం.. కలుపుకుపోదాం అన్న లక్ష్యంతో ముందుకెళ్ళుదామని ఆయన అభిప్రాయపడ్డారు.

   కాపు సేవా సమితి - చెన్నై 9వ వార్షికోత్సవ వేడుకలు ఆగష్టు 9వ తేదీ శనివారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు .చెన్నై టి.నగర్ లోని ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆంధ్రా క్లబ్)లోని గోదావరి హాలు వేదికగా జరిగిన ఈ వేడుకలో సమితి అధ్యక్షులు గూడపాటి జగన్మోహన్ రావు స్వాగతోపన్యాసం చేస్తూ చెన్నై నగరవ్యాప్తంగా సమితి సభ్యులు అధికంగా  ఉన్నారని అన్నారు..కలసి ఉందాం కలుపుకొని  పోదాం అన్నదే తమ లక్ష్యం అని, ఈ సందర్భంగా  ఆయన  సభ్యులకు పిలుపునిచ్చారు.

కాపు సేవా సమితి చైర్మన్ , సినీ నిర్మాత ఏ ఎం రత్నం సభకు అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్- గుంటూరు ఛైర్మన్ తులసి రామచంద్ర ప్రభు, గౌరవ అతిథులుగా. రవినా హెల్త్‌కేర్ హాస్పిటల్- మధురవాయల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ. శ్రీనివాస్ , హెచ్ సి ఎల్ -టెక్ -చెన్నై వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర పినిశెట్టి లు పాల్గొని కాపు సేవా సమితి సేవలు ప్రశంసించారు.
ముందుగా కార్యదర్శి నివేదికను కాపు సేవా సమితి ప్రధాన కార్యదర్శి పి.ఆర్. కేశవులు సమర్పించారు. అతిథుల సమక్షంలో కాపు సేవా సమితి డైరెక్టరీ- 2025న ఘనంగా ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు సమితి తరపున స్కాలర్షిప్ లను బహుకరించారు.వ్యాఖ్యాతగా ఆలిండియా రేడియో చెన్నై రిటర్డ్ ఉద్యోగి బిట్రా గజగౌరి వ్యవహరించగా, సమితి కల్చరల్ సెక్రటరీ బి ఆర్ భాస్కరరావు వందన సమర్పణ గావించారు .వేడుకల్లో ముందుగా వై.వెంకటేశ్వర్లు హరికథ గానం ,పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. డైరెక్టరీ కి సహకరించిన నమో గాడ్ చారిటబుల్ ట్రస్ట్ , సర్వేశ్వరి ఇండస్ట్రీస్ అధినేత సిహెచ్ సాంబశివరావు, శ్రీ కళా సుధా తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు బేతిరెడ్డి శ్రీనివాస్ , రక్షిత హాస్పిటల్, విజయ ప్లేవుడ్స్ అండ్ లామినేట్స్,జె కె ఇంటర్నేషనల్, సురేష్ అండ్ సురేష్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్,డాక్టర్ ఎస్ పి బి కల్చరల్ ట్రస్ట్ తదితర నిర్వాహకులనుకాపు సేవా సమితి తరపున ఘనంగా సత్కరించుకున్నారు.ఇందులో సమితికి చెందిన ఆకుల ప్రసాద్ , కె వి నారాయణ,
పి. ఆదినారాయణ , వై ఎస్ వి సుబ్బారావు, సి.వి.రామచంద్ర మూర్తి ,డిఎస్ఆర్ ప్రసాద్, బి.ఆర్ భాస్కర్ రావు ,
ఓ మనోహరం,సురేష్ కుమార్, తదితర సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author