
చెన్నై న్యూస్: లక్ష్యాలను ఏర్పర్చుకొని ఆదిశగా కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకుంటారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి రాజేంద్రన్ హితవు పలికారు. చెన్నై మందవేల్లి లోని తెలుగు మహాజన సమాజం నిర్వహణలో కొనసాగుతున్న శ్రీ వేణుగోపాల్ విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ 45వ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు .దీనికి స్థానిక తేనంపేట లోని కామరాజర్ ఆరంగం వేదికైంది.
పాఠశాల అధ్యక్షులు కే అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా రిటైర్డ్ ఐఏఎస్ సి. రాజేంద్రన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులు విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న శ్రీ వేణుగోపాల విద్యాలయ నిర్వాహకుల సేవలను అభినందిస్తూ మాట్లాడారు. విద్యార్థులు జీవితంలో రాణించాలంటే లక్ష్యాలను ఏర్పర్చుకోవాలని అని , అదే క్రమంలో విద్యార్థులు పట్టుదలతో చదివి లక్ష్యాలను సాధించాలని సూచించారు. అంతేకాకుండా మంచి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా లాయర్లుగా,, సమాజానికి ప్రయోజనం చేకూర్చు మంచి పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 10వ తరగతి, ప్లస్ వన్ , ప్లస్ టు పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందించారు.అలాగే ప్రతీ ఏడాది లాగానే పాఠశాల అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ఉత్తమ విద్యార్థులకు హ్యాండ్ వాచ్ లు , మెడల్స్ , నగదు బహుమతులు బహుకరించారు.ముందుగా అనిల్ కుమార్ రెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ విద్యతోనే జీవితంలో ముందుకు సాగుతారని , కష్టపడి చదివి తల్లిదండ్రులకు ,సమాజానికి ,పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.షీలా వార్షిక నివేదికను సమర్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యక్షులు కే .ఆనంద్ కుమార్ రెడ్డి, ట్రెజరర్ కే .రంగారెడ్డి ,ఈసీ మెంబర్ వెంకట్ రెడ్డి తోపాటు జె కె రెడ్డి, జె ఎం నాయుడు దంపతులు, గుడిమెట్ల చెన్నయ్య, ఊరా ఆంజనేయులు దంపతులు, కృష్ణారావు, శర్మ, తెలుగు ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు .కార్యక్రమంలో ముందుగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.


More Stories
Camerry Icecream Turns World Ice Cream Day into a Celebration of Gratitude, Honouring Chennai Police
Over 7,000 Runners Participate in the 15th Edition of the Hexaware Dream Runners Half Marathon 2026
Broadcast Media Cinema Expo (BMCE) 2026 Commences in Chennai