
చెన్నై న్యూస్ : శ్రీ కన్యాకా పరమేశ్వరీ మహిళా కళాశాల ఐ క్యూ ఏ సీ , సృజన తెలుగు భాషా మండలి సంయుక్త ఆధ్వర్యంలోతెలుగు వ్యావహారిక భాషా దినోత్సవం – గిడుగు వెంకట రామమూర్తి 162వ జయంతిని పురస్కరించుకొని తెలుగు భాష ప్రాముఖ్యత అవగాహన శిబిరం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎస్ కె పి డి ట్రస్టీ ఊరా ఆంజనేయులు విచ్చశారు. కళాశాల కరస్పాండెంట్ వూటకూరు శరత్‌కుమార్ , ప్రిన్సిపల్ ఇన్‌చార్జ్ డా. పి.బి. వనీత , వైస్ ప్రిన్సిపల్ ఎన్.వి. నప్పినై , ఐ క్యూ ఏ సీ కో-ఆర్డినేటర్ డా. పి. భరణి కుమారి, తెలుగు విభాగాధిపతి మైథిలి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ముఖ్య అతిథి ఊరా ఆంజనేయులు తన ఉత్సాహభరితమైన ప్రసంగంలో గిడుగు వెంకట రామమూర్తి త్యాగస్ఫూర్తి, మహత్తర కృషి గురించి చర్చించారు. ఆయన తెలుగు భాషను గ్రాంధిక భాష నుంచి సాధారణ ప్రజలకూ అర్థమయ్యే వ్యావహారిక భాషగా మార్చిన సందర్భాన్ని విశదీకరించి, తెలుగు భాష గొప్పదనంపై స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించారు.విద్యార్థులు, అధ్యాపకులు , ఆహ్వానితులందరి సహకారంతో ఈ అవగాహన శిబిరం విజయవంతంగా ముగిసింది.
…


More Stories
பல்லாவரத்தில் அதிமுகவினர் இடையே கோஷ்டி மோததால் பரப்பரப்பு.
JVS ARUMUGAM Submits Expression of Interest to Contest from Nellithope Constituency
மக்களின் சிரமங்களை தென்னக ரயில்வே துறை பொருட் படுத்தவில்லை- எஸ் ஆர் எம் யூ பொதுச் செயலாளர் கண்ணையா தெரிவித்துள்ளார்.