చెన్నై న్యూస్:చెన్నై వలసరవాక్కంలో ఉంటున్న తెలుగు కుటుంబమైన తోటా భానుజీ,ధారణి దంపతులు గత 55 సంవత్సరాలుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తూ స్ఫూర్తినిస్తున్నారు.
దేవతామూర్తుల ప్రతిమలు….మనిషంత ఎత్తైన గోడ గడియారాలు… షిరిడి సాయిబాబా
, మహాత్మా గాంధీ ప్రతిమలు, పురాతన రాగి బిందెలు , పుస్తకాలు ,పక్షులు ప్రతిమలు, అలనాటి కిరోసిన్ దీపాలు ఇంకా వీటిలో రైతుల జీవితం, గ్రామీణ ప్రాంత జీవన విధానం, రామాయణం, మహాభారతం ,పురాణ గాథలు తదితర విషయాలను తెలిపే బొమ్మలు పిల్లలతో పాటు పెద్దలనూ ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
దసరా నవరాత్రులు సందర్భంగా తోట భానుజీ,ధారణి తమ ఇంట్లో బొమ్మల కొలువు పెట్టి ప్రతిరోజు సాయంత్రం భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ,ప్రముఖులను, ముత్తైదువులను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. బొమ్మల విశిష్టతను తెలుపుతూ ఫలాహరాలు, ముత్తైదువులకు తాంబూలాలు అందజేస్తున్నారు.భానుజీ కుటుంబ సభ్యులు రంగనాయకులమ్మ ప్రారంభించిన ఈ బొమ్మల కొలువు ఐదున్నర దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు.ప్రముఖ నటుడు శివాజీ గణేషన్ నటించిన నవరాత్రి అనే తమిళ సినిమా కోసం తయారు చేసిన బొమ్మలను ఈ కొలువులో పెడుతుండటం విశేషం. ఎంతో వైవిధ్యమైన, స్ఫూర్తినిచ్చే ఈ దసరా బొమ్మల కొలువును చూసేందుకు తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ ను భాను జీ ,ధారణి దంపతులు ఆహ్వానించారు. అక్కడకు వెళ్లిన రాజశేఖర్ ,వారితో రెండు గంటలు పాటు గడిపిన సమయంలో వారు చూపించిన ప్రేమ ఆప్యాయతకు ముగ్దులయ్యారు.ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు చూసి ఆశ్చర్యచరితులయ్యారు. భానుజీ,ధారణి గార్లు ఎంతో ఓపికతో బొమ్మల కొలువు ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వారిని రాజశేఖర్ శాలువలతో సత్కరించి అభినందించారు. ఒక మ్యూజియంలో చూస్తే ఎంత ఆనందమో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఈ బొమ్మల కొలువు ఇస్తుందని అన్నారు.ఈ బొమ్మలు కొలువు కోసం కొన్ని బొమ్మలు అందించిన రవీంద్ర బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రంగనాయకులమ్మ కలను వారి మనవళ్ళు కొనసాగిస్తుండటం ముదావహం అని తెలిపారు.ప్రతి తెలుగు వారు భానూజీ ,ధరణి ఇంట ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును చూడాలని కోరారు.ఈ సందర్భంగా చిన్నారులకు దేవుని బొమ్మలు, పుస్తకాలను బహుకరించారు.


More Stories
Camerry Icecream Turns World Ice Cream Day into a Celebration of Gratitude, Honouring Chennai Police
Over 7,000 Runners Participate in the 15th Edition of the Hexaware Dream Runners Half Marathon 2026
Broadcast Media Cinema Expo (BMCE) 2026 Commences in Chennai