చెన్నై : చెన్నై గిడ్డంగివీధిలోని సదరన్ ఇండియా వైశ్య సంఘం (శివ) ఆధ్వర్యంలో శ్రీ వాసవీ జయంతి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం ఉదయం సంఘ ప్రాంగణంలో 501 కలశాలను ఉంచి లోకకల్యాణార్థం శ్రీ వాసవీ అమ్మవారికి విశేషపూజలు వైభవోపేతంగా నిర్వ హించారు.
అనంతరం పల్లకీలో అమ్మవారిని కొలువుదీర్చి పాల బిందెలతో నిర్వహించిన ఊరేగింపు భక్తిభావాన్ని చాటింది. మహిళలు, చిన్నారులు పెద్దసంఖ్యలో పాల్గొని పాలబిందెలతో ఉరేగింపుగా జై వాసవీ జైజై వాసవీ అంటూ అమ్మవారిని కీర్తిస్తూ ముందుకు సాగారు. ఈ వేడుకల్లో అసోసియేషన్ అధ్యక్షులు
డాక్టర్ అంజతా డాక్టర్ కనిగెలుపుల శంకర రావు నేతృత్వంలో సంయుక్త కార్యదర్శులు మద్ది నరసింహులు, పువ్వాడ అశోక్ కుమార్, కోశాధికారి పెసల రమేష్ పాటు ఉపాధ్యక్షులు జి పి వి సుబ్బారావు , మన్నారు ఉదయ్ కుమార్, ఆడిటర్ జనార్ధనం,సీనియర్ సభ్యులు పాదయాత్రగా ఎస్ కె పీ డీ ప్రాంగణానికి చేరుకుని క్షీరాభిషేకంలో పాల్గొని వాసవీమాతను భక్తిశ్రద్ధలతో సేవించారు. ముఖ్యఅతిథిగా ఎల్ అండ్ టీ ఇంజనీర్ డాక్టర్ పురుషోత్తమన్ శ్రీనాథ్, ప్రముఖ ఆడిటర్ జనని దంపతులు పాల్గొని పాలబిందెల ఊరేగింపును ఘనంగా ప్రారంభించారు.సదరన్ ఇండియా వైశ్య అసోసియేషన్ ఉపాధ్యక్షులు జీ.పీ.వీ.సుబ్బారావు సారధ్యంలో శ్రీ వాసవీ జయంతి మహోత్సవం విజయవంతమైంది. అతిథులను ఈ సందర్భంగా శాలువలతో ఘనంగా సత్కరించారు. చివరగా భక్తులందరికీ అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వాసవీ జయంతికి సహకరించిన ప్రతీఒక్కరికీ శివ తరపున నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.



More Stories
Camerry Icecream Turns World Ice Cream Day into a Celebration of Gratitude, Honouring Chennai Police
Over 7,000 Runners Participate in the 15th Edition of the Hexaware Dream Runners Half Marathon 2026
Broadcast Media Cinema Expo (BMCE) 2026 Commences in Chennai