CHENNAI: IQAC, Chaitanya & Kalaalaya Fine Arts Association of Sri Kanyaka Parameswari Arts and Science College for Women Jointly Organized Chaitanya Mega Inter – collegiate Fest 2023 – 2024 On 29.09.2023 at 10 am in the college premises. Hony Correspondent Sri Vottukuru Sarath Kumar, Principal Dr. T. Mohanasree, Dean Dr. P. Vaneetha, Vice Principal Dr. M.V. Nappinai, IQAC coordinator Dr. P. Barani Kumari, Chaitanya Committee Convenor Dr. A. Durga Devi and other committee members were present on the occasion. Many academic events such as paper presentation, Quiz, meme, oratorical competition were conducted by various departments of our college. These events are found to be very useful to develop the student’ s leadership and team working skills among the students. Above 200 students from neighboring institutions – SDNB Vaishnav College for Women, D.R.B.C.C.C Hindu College, Chevalier T. Thomas Elizabeth College for Women etc. participated in this fest.
తెలుగు భాషాభివృద్ధికి పాటుపడదాం- అతిథులు వ్యాఖ్య ; తెలుగు భాషాభివృద్ధికి ప్రతీ కృషి చేయాలని అతిధులుగా పాల్గొన్నఆల్ ఇండియా రేడియో చెన్నై ప్రతినిధులు డాక్టర్ చదలవాడ ఉదయ్ శ్రీ ,కర్లపాటి శైలజ వ్యాఖ్యానించారు. శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల , కళాలయ ఫైన్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో చైతన్య పోటీలు 2023-24 రెండోవ రోజు పోటీలు సెప్టెంబర్ 29 వతేదీ శుక్రవారం జరిగాయి ..ఇందులో తెలుగు శాఖ సృజన తెలుగు భాషా మండలి తరఫున జరిగిన పోటీల్లో నగరంలోని వివిధ కళాశాల నుంచి తెలుగు చదువుకునే విద్యార్థులు అధికంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్.డాక్టర్ టి. మోహన్ శ్రీ అధ్యక్షత వహించగా ,తెలుగు శాఖ అధ్యాపకురాలు డాక్టర్ పి ఎస్ మైథిలి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. పోటీలకు న్యాయ నిర్ణీతలు, అతిధులుగా ఆల్ ఇండియా రేడియో చెన్నై ప్రతినిధులు డాక్టర్ చదలవాడ ఉదయ్ శ్రీ ,కర్లపాటి శైలజ లు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలుగు తీసేలా పోటీలు నిర్వహించారు. విద్యా విధానంలో మార్పులు- ఉద్యోగ అవకాశాలు ,మన తెలుగు -మన వెలుగు అంటూ పలు పోటీలను నిర్వహించగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పోటీపడి మరి తమదైన ప్రతిభను చాటుకున్నారు పోటీల్లో ప్రతి పని కనబరిచిన విద్యార్థులను విజేతలుగా ఎంపిక చేసి బహుమతులను అందజేశారు .ఈ సందర్భంగా అతిథులు కర్లపాటి శైలజ ,డాక్టర్ చదలవాడ ఉదయశ్రీ తమ స్పందనను తెలుపుతూ ఎంతో ఉత్సాహంతో విద్యార్థులు పోటీల్లో తమ సృజనాత్మకతను, ప్రతిభను చాటుకున్నారని అభినందించారు తెలుగు భాషాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. భాష మరుగున పడిపోకుండా కాపాడుకోవడానికి తెలుగు వారంతా తమ పిల్లలను తెలుగు భాషలో చదివించాలని కోరారు కళాశాల యాజమాన్యం సైతం తెలుగు భాష వికాసానికి కృషి చేస్తుండటం ముదవాహం అన్నారు . విజ్ఞానాన్ని పెంచే ఇలాంటి పోటీలు విద్యార్థులను మరింత ఉన్నత స్థాయికి చేర్చుతాయని అభిప్రాయపడ్డారు.
…
More Stories
NIT Trichy Global Alumni Meet (GAM) 2025
2025 నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ” ఫేస్ పెయింటింగ్ “
Aakash Educational Services Limited Celebrates Young Math Maestros with a Grand Felicitation Ceremony on National Mathematics Day