December 25, 2024

ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా 2024 తెలుగు క్యాలెండర్ అవిష్కరణ

చెన్నై న్యూస్ : నగరంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్న ఆంధ్ర కళా స్రవంతి తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగులో ముద్రించిన 2024 నూతన సంవత్సర తెలుగు క్యాలెండర్ అవిష్కరణ శనివారం ఉదయం ఘనంగా జరిగింది. ఈ క్యాలెండర్ ను ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షుడు జె ఎం నాయుడు అవిష్కరించి సభ్యులందరికీ పంపిణీ చేశారు. ముందుగా స్థానిక కొరట్టూర్ అగ్రహారంలోని శ్రీ కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 200 మందికి పైగా పేదలకు అన్నప్రసాదం వినియోగించారు.ఈ సందర్భంగా జె ఎం నాయుడు మాట్లాడుతూ తమ స్రవంతి తరపున అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అలాగే స్రవంతి తరపున ప్రతి శనివారం నిరుపేదలకు అన్నదానాన్ని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశామని ఈ వేడుకల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ శనివారం అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్ గా వ్యవహరించి సహకరించిన స్రవంతి ఉపాధ్యక్షురాలు పి. సరస్వతి ,ఇంజనీర్ బి.ఎన్. గుప్తా లకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జె ఎం నాయుడు తోపాటు,సలహాదారులు ఎం. ఎస్ .మూర్తి, సెక్రెటరీ జనరల్ జె .శ్రీనివాస్ , కోశాధికారి జి వి రమణ ,ఇంకావీ ఎన్ హరినాథ్, రాజేంద్రన్, కుమార్,ప్రసాద్, కె ఎన్ సురేష్ బాబు,మహిళా సభ్యులు శేషరత్నం, అన్నపూర్ణ, రాధిక, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

About Author