December 25, 2024

ఇంటింటికీ అయోధ్య రామయ్య అక్షింతలు, ప్రసాదం

చెన్నై న్యూస్:అయోధ్య రాములోరి ప్రసాదం, అక్షింతలను రాష్ట్రీయ సేవా సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) , విశ్వహిందూ పరిషత్ (వి హెచ్ పి)నిర్వాహకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి పంచి పెడుతున్నారు.అందులో భాగంగా పుళల్ కవాంగరై కు చెందిన ఆర్ ఎస్ ఎస్, వి హెచ్ పి వలంటీరు, తెలుగు ప్రముఖులు జి .వెంగయ్య అధ్యక్షతన శనివారం రెడ్ హిల్స్, పులల్ కవాంగరై ప్రాంతాల్లో సుమారు 3 వేలకు పైగా కుటుంబాలకు శ్రీరాముడి ఫోటో, అయోధ్య రామాలయం ఫోటో , అక్షింతలు, ప్రసాదాన్ని పులల్ కవాంగరై తెలుగు ప్రజా సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు లయన్ జి మురళికి అందజేశారు. వీటిని మురళి ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకు పంపిణీ చేశారు.వి హెచ్ పి వలంటరీలు కాళి రాజ్ ,ఉలగ రాజన్, రామ్ మూర్తి , ముఖేష్, తెలుగు ప్రముఖులు బి.కృష్ణయ్య, బి.దామోదరం , బి .మురళి, ఎస్ నరసింహ రెడ్డి , వాసు, పి నరసింహారావు, శరత్ తదితరులు పాల్గొన్నారు ముందుగా శ్రీ సీతారామ, లక్ష్మణ ,ఆంజనేయ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ విజయవంతం కావాలని ప్రార్ధించారు.
జై శ్రీరామ్…జయరాం అంటూ రామయ్యాను ఈ సందర్భంగా కీర్తించారు.

About Author