December 25, 2024

ఉత్తమ వాసవీ క్లబ్ గా తీర్చిదిద్దుతా – నూతన అధ్యక్షులు సి.హెచ్ మల్లికార్జున రావు

చెన్నై న్యూస్:వాసవి క్లబ్ షావుకారుపేట చెన్నై, వనిత షావుకారు పేట చెన్నై క్లబ్ ల 2024 సంవత్సర నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం జనవరి 7 వ తేదీ ఆదివారం ఘనంగా జరిగింది. వి502ఏ జిల్లా గవర్నర్ రష్మి ఓలేటి, రీజియన్ చైర్పర్సన్ ముంజులూరు మురళీమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ షావుకారుపేట చెన్నై నూతన అధ్యక్షులుగా మల్లికార్జున రావు, కార్యదర్శిగా డి.త్రిలోక్ బాబు, కోశాధికారిగా కె.ప్రవీణ్ కుమార్, అలాగే వనిత షావుకారు పేట చెన్నై క్లబ్ అధ్యక్షురాలిగా
నాగలక్ష్మి, కార్యదర్శిగా పూర్ణిమ, కోశాధికారిగా శివరంజనిలు ప్రమాణస్వీకారం చేసి తమ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం ముందుగా గోపూజ, లలిత సహస్రనామం, వాసవి మాతకు ప్రత్యేక పూజలను చేపట్టారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు సి హెచ్ మల్లికార్జున రావు మాట్లాడుతూ వాసవీ క్లబ్ ద్వారా సమాజానికి సేవ చేసే భాగ్యం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంచి సేవా ప్రాజెక్టులతో సభ్యుల సహకారంతో తమ క్లబ్ ను బెస్ట్ క్లబ్ గా నిలుపుతానని అన్నారు. వాసవీ క్లబ్ వి502ఏ జిల్లా గవర్నర్ రష్మి ఓలేటి మాట్లాడుతూ క్రియేటివిటీతో మంచి ప్రాజెక్టులను ఎంచుకుని ముందుకు సాగాలని సభ్యులకు హితవుపలికారు.రక్తదానంలో రికార్డు సృష్టిద్దామని వాసవి క్లబ్ లకు ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ ల ప్రముఖులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author