కారణజన్ముడు… ఎన్టీఆర్
- గుడిమెట్ల చెన్నయ్య వ్యాఖ్య చెన్నై న్యూస్ :తన నటనతో ప్రజలహృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటుడు ఎన్టీఆర్ కారణజన్ముడని జనని సంస్థ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య కొనియాడారు. చెన్నైకు చెందిన పెరంబూరు తెలుగు సాహితీ సమితి ఆధ్వర్యంలో అనన్య సామాన్య ధారావాహిక ఉపన్యాస కార్యక్రమం 97వ ప్రసంగం ఏప్రిల్ 16 తేదీ ఆదివారం జరిగింది. పెరంబూరులోని డి.ఆర్.బి.సి.సి.సి.మహోన్నత పాఠశాల ప్రాంగణం వేదికగా తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని నలుదిశలా చాటిన ఎన్టీఆర్ శత జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని “విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు-శ్రీ నందమూరి తారక రాముడు ” అనే అంశం పై ఏర్పాటు అయిన ఈ ఉపన్యాస కార్యక్రమానికి వక్తగా గుడిమెట్ల చెన్నయ్య పాల్గొన్నారు. కారణజన్ముడు…ఎన్టీఆర్: గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ వెండి తెరపై నవరసాలు పండించిన మహానటుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.ఆయన ఏ పాత్ర వేసిన అందులో ఒదిగిపోయి నటిస్తారని తెలిపారు.రాముడు పాత్ర వేస్తే రాముడిగా, కృష్ణుడు పాత్ర వేస్తే శ్రీకృష్ణుడుగా అచ్చు గుద్దినట్టు ఉండేవారని అన్నారు.300 లకు పైగా చిత్రాల్లో నటించి పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం సైతం వహించారని అన్నారు.అనేక పౌరాణిక, జానపద,సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి
అశేష ప్రజాభిమానులను ఎన్టీఆర్ సంపాదించు కున్నారని వ్యాఖ్యానించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆ మహామనిషి శత జయంతి సందర్భంగా పెరంబూరు తెలుగు సాహితీ సమితి ద్వారా స్మరించు కోవటం తమ అదృష్టం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఎన్టీఆర్ తెలుగు నేలపై ప్రభవించడం తెలుగు వారిగా మనందరి అదృష్టమని చెప్పారు.కృషి,దీక్ష, పట్టుదలకు ప్రతీకగా,నియమ నిష్టలకు, క్రమశిక్షణకు మారుపేరుగా ఆఖరి క్షణం వరకు జీవితాన్ని సాగించిన మహావ్యక్తి ఎన్టీఆర్ పేర్కొంటూ ఆయన నటించిన చిత్రాలు విశేషాలు,పాటలు ఆలపిస్తూ సభికులను ఆకట్టుకున్నారు. సినీ రంగంలో 50 ఏళ్ల పాటు ఏక ఛత్రాధిపతిగా ఏలాడని చెప్పారు.లవకుశ సినిమా ద్వారా శ్రీరాముని పాత్రలో ఒదిగిపోయి రాముడంటే ఇలానే ఉంటారని చాటారని తెలిపారు.సభకు పెరంబూరు తెలుగు సాహితీ సమితి అధ్యక్షులు తమ్మినేని బాబు అధ్యక్షత వహించగా,కార్యదర్శి డాక్టర్ టి ఆర్ ఎస్.శర్మ (శ్రీలక్ష్మీప్రియ)స్వాగత పలుకులు పలుకగా,వక్తను వసుంధరా దేవి పరిచయం చేసి ప్రార్ధనాగీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వక్తను సమితి తరపున తమ్మినేని బాబు,టి ఆర్ ఎస్ శర్మ తోపాటు గాయకులు కిడాంబి లక్ష్మీకాంత్,తెలుగు ప్రముఖులు ఎన్ వి విజయ సారథి,వంజరపు శివయ్య శాలువలతో సత్కరించారు. నాటక కళాకారులు కాకాణి వీరయ్య,అంబ్రూనీ, మాస్ సంస్థ అజరత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
…
More Stories
Ramakrishna Math, Chennai, Wins ‘Spirit of Mylapore’ Award 2025 from Sundaram Finance
ஜாதி வாரி கணக்கெடுப்பு நடத்த மத்திய மாநில அரசை வலியுறுத்தி ஆர்ப்பாட்டம்
Birds of Paradise – an exhibition of theme-based art quilts