December 23, 2024

గోపూజలో ఆర్యవైశ్య అన్నదాన సభ మహిళా సభ్యులు, అధ్యక్షురాలు భాగ్య లక్ష్మీ

చెన్నై : ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం గోశాల ప్రాంగణంలో గోపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.2023 ఏప్రిల్ 6వ తేదీ గురువారం ఉదయం ఆర్యవైశ్య అన్నదాన సభ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి అధ్యక్షతన గోశాలలోని ఆవులకు పసుపు కుంకుమ, పూలతో విశేషంగా అలంకరించి గోపూజను గావించారు.అనంతరం సభ మహిళా సభ్యులంతా కలసి విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, భగవద్గీతలను సామూహికంగా పారాయణం చేసి భక్తిని చాటుకున్నారు. గోవులకు ఆహారం అందించి మరీ గోమాత ఆశీస్సులు అందుకున్నారు. పూజల్లో పాల్గొన్న భక్తులందరికి ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టేలా 2010 లో స్థాపించిన ఆర్యవైశ్య అన్నదాన సభ ప్రతీ నెలా అమావాస్య రోజున సునాధ వినోదిని బృందం చే బ్రాడ్ వే లోని యతిరాజ మహిళా మండలి వద్ద భక్తిగీతాలు ఆలాపాన చేస్తున్నామని ,అలాగే
ప్రతీ నెలా పౌర్ణమి రోజున శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గోపూజను తమ సభ తరపున చేపడుతున్నామని అన్నారు.గోవు సమస్త దేవతాస్వరూపం తెలిపారు.గోమాతను పూజించడం భారతీయ సంస్కృతిలో పురాతన కాలం నుంచి ఈ సంప్రదాయంగా వస్తోందని తెలిపారు.గోపూజ వలన మానవాళిని పీడిస్తున్న సమస్త దోషాలు తొలగి పోవడమే కాకుండా , శ్రేయస్సు కలుగుతుందని పేర్కొన్నారు. అందరూ గోమాతను పూజించాలని ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు.ఈ పూజల్లో మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


….

About Author