January 22, 2025

ఘనంగా టామ్స్ సౌత్ చెన్నై జిల్లా ప్రెసిడెంట్ రొడ్డా జయరాజ్ 66వ జన్మదిన వేడుకలు

చెన్నై న్యూస్:సంఘ సేవకులు , టామ్స్ సౌత్ చెన్నై జిల్లా ప్రెసిడెంట్ రొడ్డా జయరాజ్ 66వ జన్మదిన వేడుకలు జులై 7 వ తేదీన కోలాహలంగా జరుపుకున్నారు. కుటుంబ సమేతంగా కలసి కేక ను కట్ చేసే పుట్టినరోజు వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ వేడుకల్లో సెయింట్ థామస్ మౌంట్ గ్రామపంచాయతీ పెద్దలు T.M. గోపి, S.రంగయ్య ,మాతంగి నరసయ్య , V. రాజేష్, CH. పద్మయ్య ,A. పెంచలయ్య తదితరులు పాల్గొని రొడ్డా జయరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సంక్షేమ సహాయకాలు అందజేశారు.జులై 8వ తేదీన తమిళనాడు ఆది ఆంధ్ర అరుంధతీయ మహాసభ (టామ్స్) ఆధ్వర్యంలో టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇశ్రాయేలు అధ్యక్షతన టామ్స్ రాష్ట్ర అధ్యక్షులు నేలటూరి విజయకుమార్ నేతృత్వంలో స్థానిక నుంగంబాక్కంలో జనోదయం ప్రధాన కార్యాలయం వేదికగా రొడ్డా జయరాజు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు .ఈ సందర్భంగా గొల్లపల్లి ఇశ్రాయేల్ , N. విజయకుమార్ అలాగే టామ్స్ ముఖ్య నాయకులు B.N .బాలాజీ ,V. దేవదానం, స్వర్ణ జయపాల్ , సి.హెచ్ తిరుమల రావు , రోశయ్య ప్రసన్న తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే రొడ్డా జయరాజును ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా గొల్లపల్లి ఇశ్రాయేలు మాట్లాడుతూ సమాజ సేవకు రొడ్డా జయరాజ్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు .పారిశుద్ధ కార్మికులకు ,అలాగే సమాజంలోని నిరుపేద వర్గాల వారికి టామ్స్ తరపున సహాయ పడుతున్నారని ఆయనను అభినందించారు. అనంతరం తన పుట్టినరోజు వేడుకలును ఎంతో అభిమానంతో , ప్రేమతో ఘనంగా జరుపుకున్న కుటుంబ సభ్యులకు , స్నేహితులకు, టామ్స్ నిర్వాహకులకు రొడ్డా జయరాజ్ ధన్యవాదాలు తెలియజేశారు..

About Author