
చెన్నై: కేటిసీటీ పూర్వ విద్యార్థినిల సంఘం ఆధ్వర్యంలో స్నేహం-2023 సెలెబ్రేషన్స్ ను ఘనంగా జరుపుకున్నారు. చెన్నై పుదుపేటలోని చంద్రభాను వీధిలో ఉన్న నాథముణిహాలులో ఆదివారం ఉదయం జరిగిన ఈ వేడుకలకు సంఘం అధ్యక్షురాలు జి. సరళ అధ్యక్షత వహించారు. సరళ మాట్లాడుతూ ప్రతీ ఏడాది స్నేహం గొప్పతనాన్ని చాటి చెప్పేలా సంఘం తరపున వేడుకలను జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ స్నేహం వేడుకల్లో కార్యవర్గ సభ్యులంతా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు .తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి , విద్యార్థులు విద్యా వికాసానికి కెటిసిటీ పూర్వవిద్యార్థినిల సంఘం ఎంతో కృషి చేస్తుందని గుర్తు చేశారు. స్నేహం-2023 వేడుకల్లో సంఘ సభ్యులకు స్పాట్ గేమ్స్, హౌసీ హౌసీ, ఛేంజ్ ఫర్ ఛేంజ్, లక్కీ డ్రా తదితర పోటీలు నిర్వహించారు. ఇంకా ఫోటో బూత్, వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎంతో ఉత్సాహంగా మహిళలు పోటీల్లో పాల్గొని తమదైన ప్రతిభను చాటుకున్నారు. విజేతలుగా నిలిచిన మహిళలకు సంఘం అధ్యక్షురాలు జి. సరళ, సెక్రటరీ ఈ. షర్మిళ , కోశాధికారి బి. లక్ష్మీ దేవి కలసి బహుమతులను బహుకరించారు. ఈ వేడుకల్లో కేటిసిటీ పూర్వ విద్యార్థినిల సంఘం సభ్యులంతా పాల్గొని స్నేహం వేడుకలను విజయవంతం చేశారు.
More Stories
Labor of Love: Farmer Sundar Raj’s Story of Devotion and Resilience
சட்ட மாமேதை டாக்டர் அம்பேத்கர் அவர்களின் 135வது பிறந்த நாளை முன்னிட்டு நாடு முழுவதும் மிகை எழுச்சியாக கொண்டாடப்பட்டது
தமிழ்நாடு வக்பு சொத்துக்களை காலக்கெடுவுக்குள் டிஜிட்டல் முறையில் அளவீடு செய்ய தமிழ் மாநில முஸ்லிம் லீக் வலியுறுத்தல்