December 25, 2024

టామ్స్ తరపున రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి (లీగల్ విభాగం) జీసి నాగూర్ కు ఘన సత్కారం

చెన్నై న్యూస్:తమిళనాడు విద్యుత్ బోర్డులో లీగల్ అడ్వైజర్ వ్యవహరించిన జీసీ నాగూర్ ను తమిళనాడు రాష్ట్రప్రభుత్వం అధనపు కార్యదర్శి(లీగల్ విభాగం)గా నియమించిన సందర్భంగా తమిళనాడు ఆది ఆంధ్ర అరుంధతీయ మహాసభ (టామ్స్ ) ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. స్థానిక నుంగంబాక్కంలోని జనోధయం కార్యాలయంలో జనవరి 13 తేది శనివారం జీసి నాగూర్ కు అభినందన సభ ఏర్పాటు చేయగా . టామ్స్ వ్యవస్థాపకులు, జనోధయం ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ గొల్లపల్లి ఇశ్రాయేల్ నేతృత్వంలో జరిగిన సభకు టామ్స్ అధ్యక్షులు నేలటూరి విజయ్ కుమార్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా జీసి నాగూర్ గారిని పూలమాల, శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు . ఇంకా నగరంలోని ఆది ఆంధ్ర సంఘాల నాయకులు,టామ్స్ సభ్యులు పెద్దసంఖ్యలో హాజరై నాగూర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు . ముందుగా ఇశ్రాయేల్ మాట్లాడుతూ ఆది ఆంధ్రుల ఆణిముత్యం జిసి నాగూర్ అని ప్రశంసించారు. ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప లక్షణం ఉన్న వ్యక్తి అని ఆయనకు టామ్స్ సంస్థ తరపున శుభాకాంక్షలు తెలిపారు. నేలటూరి విజయకుమార్ మాట్లాడుతూ నాగూర్ గారు ఆది ఆంధ్ర ప్రజలకు, యువతకు ఎంతో ఆదర్శమన్నారు. మాస్ అధ్యక్షులు కొల్లిరాజు మాట్లాడుతూ ఉన్నత భావాలు కలిగి మహనీయులు అంబేద్కర్ ఆశయాలతో ముందుకు నడుస్తున్న నాగూర్ మరింత ఉన్నత పదవులను ఆధిరోహించాలని ఆశీర్వదించారు. చివరిగా సత్కార గ్రహీత నాగూర్ మాట్లాడుతూ తన ఎదుగుదలలో తల్లిదండ్రులు, గురువులతో పాటు టామ్స్ సంస్థ సహకారం ఎంతైనా ఉందని చెప్పారు. తనను గౌరవించిన టామ్స్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాస్ సంస్థ అధ్యక్షుడు, శాస్త్రవేత్త డాక్టర్ కొల్లిరాజు 63 వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా టామ్స్, తెలుగు ప్రమఖుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్ సి హెచ్ తిరుమల రావు, టామ్స్ నాయకులు స్వర్ణ జయపాల్ , రొడ్డా జయరాజ్ , డాక్టర్ చల్లగాలి యాకోబు , పాల్ కొండయ్య, అద్దంకి ఐసయ్య ,బిఎన్ బాలాజీ , ఆరోన్ , మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్టు చర్చి కార్యదర్శి ప్రభుదాస్, చెన్నై కస్టమ్స్ అధికారి. పందిటి ఆదిలక్ష్మయ్య సహా పలువురు పాల్గొని నాగూర్ గారికి శుభాకాంక్షలు తెలిపారు.

About Author