January 5, 2025

తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ ఆధ్వర్యంలో ” దాండియా ధమాకా ” సంబరాలు

చెన్నై న్యూస్ : తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ (మద్రాసు యూనిట్) ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని దాండియా ధమాకా సంబరాలను అక్టోబర్ 11 వ తేదీ బుధవారం కోలాహలంగా జరుపుకున్నారు. బుధవారం మద్యాహ్నాం 3 గంటల నుంచి సాయంత్రం6 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి చెన్నైలోని అన్నానగర్ టవర్ క్లబ్ వేదికగా నిలిచింది. తమిళనాడు ఆర్య వైశ్య మహిళా సభ చైర్ పర్సన్ అనితా రమేష్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ మహిళా సభ నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుందని తెలిపారు. ఈ మహిళ సభను సభ్యులందరి సహకారంతో చైర్ పర్సన్ లుగా వ్యవహరించిన వారు అభివృద్ధి చేయటం తో పాటు మహిళా సభ ద్వారా సమాజానికి , నిరుపేదలకు , పేద విద్యార్థులకు చేయూతనిచ్చినట్టు గుర్తుచేశారు. నగర జీవనంలో ఆయా పనుల్లో బిజీగా ఉండే మహిళలకు ఆటవిడుపు కల్గించేలా దాండియా ధమాకా సంబరాలు చేస్తున్నామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది మహిళలు పాల్గొని ఆటపాటలతో, దాండియా నృత్యాలతో, కోలాట నృత్యాలతో సందడి చేయగా ,డ్యాన్సర్ హరి మాస్టర్ బృందంతో కలసి మహిళా సభ సభ్యులంతా దాండియా నృత్యాలతో కనువిందు చేశారు.సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేరీతిలో మహిళలు సంప్రదాయ దుస్తులలో హాజరై ఎంతో ఆహ్లాదకరంగా గడిపారు .ఈ సందర్భంగా అద్భుతమైన ప్రదర్శన కనపరిచిన మహిళలకు సర్ప్రైజ్ గిఫ్ట్ తోపాటు పాల్గొన్న వారిందరికీ గిఫ్ట్ హ్యాంపర్లను మహిళసభ ఛైర్ పర్సన్ అనిత రమేష్, సెక్రటరీ లక్ష్మీ కర్లపాటి, కోశాధికారి వసుంధర సుంకు, దాండియా ధమాకా కన్వీనర్ పద్మప్రీతా సుమంత్ లు కలసి బహుకరించారు.

About Author