December 25, 2024

పారిశుద్ధ్య కార్మికులకు పి. లక్ష్మణరావు దంపతుల వితరణ

చెన్నై న్యూస్ : చెన్నై మహానగరంలోని కొడుంగైయూర్ సీతారామ నగర్ ప్రజా సంక్షేమ సంఘ కార్యదర్శి, వ్యాపార సంఘం – నార్త్ చెన్నై
ఉపాధ్యక్షులు , కె.బి.స్టోన్స్ అధినేత పి. లక్ష్మణరావు దంపతులు సంక్రాంతి పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు కొత్త బట్టలు, నగదును బహుమతిగా బుధవారం ఉదయం అందజేశారు. వీరు గత పది ఏళ్లగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పేదలకు,పారిశుద్ధ్య కార్మికులకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా పి. లక్ష్మణరావు దంపతులకు పారిశుధ్య కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు తెలుగు ప్రముఖులు, సామాజిక వేత్తలు సైతం పి. లక్ష్మణరావు దంపతుల సేవలను ప్రశంసించారు.

About Author