చెన్నై న్యూస్:స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ..మహిళ అవార్డులు…వామ్ ఐకానిక్ అవార్డులు.. సాంస్కృతిక ప్రదర్శనలు… వివిధ రకాల పోటీలు… కార్నివల్స్ .. ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు …వామ్ కొత్త విభాగాల ప్రారంభం ,మెంబర్షిప్ డ్రైవ్ లతో వామ్ జాతీయ స్థాయి మహిళా సదస్సు గ్రాండ్ సెక్సస్ అయింది.
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) మహిళా విభాగ్ ఆధ్వర్యంలో అపరాజిత పేరిట జాతీయస్థాయి మహిళా సదస్సు ఫిబ్రవరి 10వ తేదీ శనివారం ఘనంగా జరిగింది.దీనికి చెన్నైలోని టీ.నగర్ లో ఉన్న పిట్టి త్యాగరాయర్ కలై అరంగం వేదికైంది. వామ్ గ్లోబల్ ప్రెసిడెంట్ తంగుటూరి రామకృష్ణ, గ్లోబల్ అడ్వైజర్ టి రాజశేఖర్ ల పర్యవేక్షణలో వామ్ గ్లోబల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జ్యోతి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్ టీజీ వెంకటేష్, అంబికా గ్రూప్ అధినేత అంబికా కృష్ణ , గౌరవ అతిథిగా నటుడు రాజ్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.దేశంలోనే తొలిసారిగా ఆర్యవైశ్యులు మహిళా కాన్ఫరెన్స్ పెద్ద ఎత్తున జరుగగా ఇందులో దేశంలోని 12 రాష్ట్రాల నుంచి ఆర్యవైశ్య మహిళలు పాల్గొని మహిళా సాధికారత, వివిధ రంగాల్లో మహిళలు ఏవిధంగా రాణించాలన్న విషయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. పలువురు మహిళలు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు మహిళల్లో ఉత్తేజాన్ని నింపాయి.ఈ సందర్భంగా టి జి వెంకటేష్ మాట్లాడుతూ మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలదని ఇప్పటికే పలువురు మహిళలు నిజం చేశారని అన్నారు. మహిళలు ధైర్యంగా అడుగులు వేసి జీవితంలో ఆదర్శమైన మహిళగా పేరుగడించాలని పిలుపునిచ్చారు. ఆర్యవైశ్యులంతా ఐక్యమత్యంతో ముందుకుసాగాలని అప్పుడే మన హక్కులను సాధించుకోగలం అని అభిప్రాయ పడ్డారు. అంతకుముందు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ప్రెసిడెంట్ తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ 2024 సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ వామ్ కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో దేశంలోనే మొట్టమొదటి సారి జాతీయ స్థాయి ఆర్యవైశ్యుల మహిళా సదస్సు జరగటం , దీనికి తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర , కర్ణాటక వంటి 12 రాష్ట్రాల నుంచే కాకుండా దుబాయ్ నుంచి మహిళలు పాల్గొని సెక్సస్ చేయటం నిజంగా గర్వంగా ఉందన్నారు.ఈ సదస్సు విజయానికి తోడ్పడ్డ ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులంతా ఒక్కటే అన్న భావన కలిగించటమే ప్రధాన ఉద్దేశంగా ఈ సదస్సు చేపట్టినట్లు తెలిపారు.వామ్ గ్లోబల్ అడ్వైజర్ టి.రాజశేఖర్ మాట్లాడుతూ మహిళా సదస్సును విజయవంతం చేసిన మహిళలతో పాటు స్పాన్సర్లుగా వ్యవహరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలు వామ్ తరఫున 120 మంది మహిళలకు అవార్డులు, పట్టుచీరలు, ఇంకా జయరాజ్ గ్రూప్ నుంచి వెండి బహుమతులు ,అయోధ్య అక్షింతలు లను అందించామన్నారు.ఈ కార్యక్రమంలో వామ్ గ్లోబల్ సెక్రెటరీ డాక్టర్ పి. మల్లికార్జున, కోశాధికారి ఎల్ వి కుమార్, హైదరాబాద్ కి చెందిన గురు ప్రసాద్ , గ్లోబల్ లీడర్ జయశ్రీ రాజశేఖర్ ,
తంగుటూరి రమాదేవి , శ్రీలత ఉపేంద్ర, కె కె త్రినాధ్, వి ఎన్ హరినాధ్, పేర్ల బద్రినారాయణ, బెల్లంకొండ సాంబశివరావు, బెల్లంకొండ శివ ప్రసాద్ , ఎం ఆర్ ఎన్ గుప్తా (దుబాయ్) ,మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
More Stories
సూర్యకాంతం నటన అనితరసాథ్యం- నటి పద్మిని వ్యాఖ్య
உலக தியான தினம் குறித்த முக்கிய உரை நாளை இந்திய நேரப்படி இரவு எட்டு மணி அளவில் நிகழ்த்த உள்ளது
NATIONAL OPEN ROTARY PARA TABLE TENNIS TOURNAMENT – SEASON3