చెన్నై న్యూస్:తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ(మద్రాసు యూనిట్) ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆషాడ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా దీప లక్ష్మీ పూజతో పాటు రంగనాయకి తాయారుకి సర్వ సౌభాగ్య సిద్ధి ప్రదాయని పూజ,ఎంతో విశేషమైన శ్రీ సూక్తం నామావళి పూజలను భక్తి శ్రద్ధలతో చేపట్టారు. మానవాళి ఆరోగ్యం, ఐశ్వర్యం ,లోకక్షేమం కోసం వైభవంగా ఈ పూజలను నిర్వహించారు. తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ నూతన అధ్యక్షురాలు అనితా రమేష్ ముందుగా స్వాగతోన్యాసం చేశారు.కార్యదర్శి లక్ష్మీ కర్లపాటి వందన సమర్పణ చేశారు.మహిళా సభ కోశాధికారి వసుంధర పాల్గొన్నారు.ముందుగా
స్వరార్ణవ బృందం ఆలపించిన భక్తి పాటలు ఆధ్యాత్మిక శోభను తెచ్చాయి.ఈ పూజలో దాదాపు 200 మంది పాల్గొన్నారు. భక్తులందరికీ ప్రసాద వినియోగం చేశారు.తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ(మద్రాసు యూనిట్) తరపున ఉదయం 10 గంటలకు జరిగిన కార్యక్రమంలో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు కోసం దరఖాస్తులు అందజేశారు.
…
More Stories
காங்கிரஸ் மாமன்ற உறுப்பினர் சுகன்யா செல்வம் தலைமையில் சமத்துவ பொங்கல் விழா
వైభవంగా ఆర్యవైశ్య అన్నదాన సభ 15వ వార్షికోత్సవ వేడుకలు
తెలుగు వెలుగు తరపున సంక్రాంతి కానుకలు అందజేసిన అల్లింగం రాజశేఖర్