చెన్నై : వరాజ్ ఆర్ట్ ఆధ్వర్యంలో ” సర్వం” పేరిట 3వ ఎడిషన్ మండల ఆర్ట్ ప్రదర్శన (Mandala art show- SARVAM )ను చెన్నై నుంగంబాక్కం ,123 స్టెర్లింగ్ రోడ్డులోని ఆర్ట్ హౌస్ వేదికగా ఏర్పాటు చేశారు.వరాజ్ ఆర్ట్ నిర్వాహకులు ,ఆర్ట్ థెరపిస్ట్ వరలక్ష్మి భరణిధరన్ తో పాటు చిత్రకారిణి హరిణి కార్తికేయన్ నేతృత్వంలో ఆగష్టు 5వ తేదీ శనివారం నుంచి ఏర్పాటు అయిన ఈ ప్రదర్శనలో పలు రకాల వైవిధ్యభరితమైన మండల ఆర్ట్ లను కొలువు దీర్చారు. ప్రత్యేకించి ఆర్ట్ థెరపిస్ట్ వరలక్ష్మి భరణిధరన్ శిష్యులు మణిమాల రావు, జయశ్రీ సురేష్ ల కుంచెల నుంచి జాలువారిన మండల కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కిన
చేతితో చిత్రించిన అతిపెద్ద మండల పెయింటింగ్ కళాప్రియుల మనసుదోచేస్తుంది.ఈ కార్యక్రమంలో అతిధులుగా ప్రఖ్యాత చిత్రకారులు కేశవ్,గాయకులు టి ఆర్ మహాలింగం మనమరాలు డాక్టర్ ప్రభా గురుమూర్తి లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా అతిధులు మండల ఆర్ట్ ప్రదర్శన లోని చిత్రాలను తిలకించి ఆర్టిస్ట్ వరలక్ష్మి భరణిధరన్ ను, వారి శిష్యులను కళా ప్రతిభను ప్రశంసించారు. మండల ఆర్ట్ పై అవగాహన పెరగాలని ,ఈ కళ ను ఎవరైనా సులువుగా నేర్చుకోవటం తో పాటు శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించి , సంపూర్ణ ఆరోగ్యం, ఆనందంతో జీవించవచ్చునని తెలిపారు.ఈ కార్యక్రమం అజంతా గ్రూప్ అధినేత అజంతా డాక్టర్ కే.శంకర రావు విజయలక్ష్మి దంపతులు,టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇశ్రాయేలు , పలువురు చిత్రకారులు, విద్యార్థులు పాల్గొని మండల కళాఖండాలు చూసి మైమరిసిపోయారు. ప్రత్యేకించి గాయకులు మాస్టర్ అనిరుధ్ రామ్‌కుమార్ మండల ఆర్ట్ ల భావాలకు అనుగుణంగా పాటలను అలపించి ఆకట్టుకున్నాడు.ఈ నెల 7 వ తేదీ వరకు ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
More Stories
సూర్యకాంతం నటన అనితరసాథ్యం- నటి పద్మిని వ్యాఖ్య
உலக தியான தினம் குறித்த முக்கிய உரை நாளை இந்திய நேரப்படி இரவு எட்டு மணி அளவில் நிகழ்த்த உள்ளது
NATIONAL OPEN ROTARY PARA TABLE TENNIS TOURNAMENT – SEASON3