December 25, 2024

వామ్ లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

చెన్నైన్యూస్:ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) గ్రేటర్ చెన్నై మహిళా విభాగ్ , అన్నానగర్ మహిళా విభాగ్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.చెన్నై నగరంలోని చూలైమేడ్ లోని వామ్ ప్రధాన కార్యాలయంలో జనవరి 28వ తేదీ ఆదివారం జరిగిన ఈ సంక్రాంతి సంబరాలకు మహిళలు,చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని కనువిందు చేశారు. గ్రేటర్ చెన్నై మహిళా విభాగ్ అధ్యక్షురాలు శ్రీలత ఉపేంద్ర , అన్నానగర్ మహిళా విభాగ్ అధ్యక్షురాలు రాణి హరినాధ్ ల అధ్యక్షతన వేడుకలు సాగాయి.ముఖ్య అతిథిగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ పాల్గొని సంక్రాంతి సంబరాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ ఆట పాటలకు స్టెప్పులు వేసి చిన్నారులు, మహిళలు అందరినీ ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు భోగి పండ్లు పోసి అనేక బహుమతులను అందించి తంగుటూరి రామకృష్ణ దంపతులతో పాటు మహిళలు, పెద్దలు ఆశీర్వదించారు.భోగి, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని నిర్వహించిన డ్యాన్స్ , ప్రతిభా పోటీలలో గెలిచిన వారికి తంగుటూరి రామకృష్ణ బహుమతులు అందజేసి అభినందించారు. ప్రపంచ దేశాల్లో కళ్ల భారతీయ సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు గురించి భావితరాలకు అందించడమే లక్ష్యంగా ప్రముఖ పండుగలను జరుపుకుంటున్నట్టు తంగుటూరి రామకృష్ణ పేర్కొన్నారు. శ్రీలత ఉపేంద్ర, ఉమా, అరుణ కుమారి, రాణి హరినాధ్, కృష్ణ కుమారి ,తంగుటూరి రాజ్యలక్ష్మి పర్యవేక్షణలో సాగిన ఈవేడుకల్లో వామ్ నిర్వాహకులు , సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రత్యేకించి గాయని చుక్కల విజయలక్ష్మి సారధ్యంలో వారి బృందం సంక్రాంతి పాటలు, అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా శ్రీరాముని పై పలు భక్తిపాటలను ఆలపించి అలరించారు. చిన్నారుల నృత్యాలు సైతం కనువిందు చేశాయి.ఈ కార్యక్రమానికి సహకరించిన టి. రాజశేఖర్, తంగుటూరి రమాదేవి, రాణీ హరినాధ్, కె కె త్రినాధ్ , పొన్నూరు రంగనాయకులు, బెల్లంకొండ శివ ప్రసాద్,బెల్లంకొండ సాంబశివరావు, జి.రాధాకృష్ణన్ తదితర పెద్దలందరికీ తంగుటూరి రామకృష్ణన్ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని సంక్రాంతి వేడుకలను విజయవంతం చేశారు.

About Author