చెన్నై న్యూస్ :జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్)- చెన్నై ఆధ్వర్యంలో జులై 15,16 తేదీల్లో నిర్వహించిన వార్షిక పోటీలు-2023 విశేష స్పందన తో విజయవంతం అయ్యాయి. జెట్-చెన్నై అధ్యక్షులు పి.రవీంద్ర కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ పోటీలకు చెన్నై అశోక్ నగర్ లో ఉన్న జి ఆర్ టి మహాలక్ష్మీ పాఠశాల ప్రాంగణం వేదికైంది. రెండు రోజుల పాటు విద్యార్థులకు రామాయణం లోని కిస్కింద కాండ ఘట్టాలు పై చిత్రలేఖన పోటీలు,యామునాచార్య ఆలవందార్ స్తోత్రం , నాళాయిర దివ్య ప్రబంధనం ,రామానుజ నుట్రాందద్రి పోటీలు ,శ్రీ విష్ణు సహస్రనామం పై అవధానం పోటీలు,రామాయణంలోని కిస్కింద కాండ క్విజ్ పోటీలు , అలాగే పలు శ్లోకాల పోటీలు నిర్వహించారు. రెండు రోజుల పోటీల్లో దాదాపు 1500 మంది విద్యార్థులు ఉత్సహంగా పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. విజేతలకు సర్టిఫికెట్లు,జ్ఞాపికలను నిర్వాహకులు బహుకరించారు.
జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్)-చెన్నై అధ్యక్షులు పి రవీంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి మంగళా శాసనాలతో జెట్ -చెన్నై తరపున 28వ వార్షిక పోటీలు చేపట్టామని తెలిపారు.నగరంలోని వివిధ పాఠశాలల్లో చదువు కుంటున్న యూ కె జి నుంచి ప్లస్ టూ వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమదైన ప్రతిభను చాటుకోవటం పై చిన్నారులను అభినందించారు. చిన్ననాటి నుంచి విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించేరీతిలో ప్రతీ ఏడాది వార్షిక పోటీలు చేపడుతున్నామని అన్నారు.గత మూడు దశాబ్దాలుగా జెట్ -చెన్నై సభ్యులు నగరంలోని పాఠశాలల్లో విద్యార్థులకు ప్రజ్ఞ తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు. కోవిడ్ నుంచి ఆన్ లైన్ లోను ప్రజ్ఞ పోటీలు చేపట్టడంతో దేశ విదేశాల నుంచి ప్రజ్ఞ తరగతులకు హాజరు అవుతుండటం విశేషం అని వ్యాఖ్యానించారు.విద్యార్థుల్లో చిత్ర లేఖనం , పురాణం ఇతిహాసాల ఆసక్తి పెంచే విధంగా ఈ పోటీలు నిర్వహించామని అన్నారు. రెండు రోజుల వార్షిక పోటీలకు శ్రీసిటీ అధినేత రవి సన్నారెడ్డి స్పాన్సర్ గా వ్యవహరించారని వారికి జెట్ -చెన్నై తరపున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జెట్ చెన్నై కార్యవర్గ సభ్యులు పోటీల ఏర్పాట్లును పర్యవేక్షించారు.. ఈ పోటీలకు అతిధులుగా పాల్గొన్న వారు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్)- చెన్నై విభాగం చేస్తున్న సేవలను కొనియాడారు.విజేతలుగా నిలిచిన వారికి జెట్ చెన్నై విభాగం అధ్యక్షులు రవీంద్ర కుమార్ రెడ్డి తో పాటు ప్రముఖ ప్రవచనకర్త శ్రీనివాస్ బహుమతులు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.ఈ పోటీలకు శ్రీ సిటీ అదినేత రవి సన్నారెడ్డి, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిలు స్పాన్సర్లుగా వ్యవహరించారని,అదే విధంగా జెట్ నిర్వాహకులు, ఇతర దాతల సహకరించి జెట్ -చెన్నై వార్షిక పోటీలను విజయంవంతం చేశారని తెలిపారు.
…
More Stories
காங்கிரஸ் மாமன்ற உறுப்பினர் சுகன்யா செல்வம் தலைமையில் சமத்துவ பொங்கல் விழா
వైభవంగా ఆర్యవైశ్య అన్నదాన సభ 15వ వార్షికోత్సవ వేడుకలు
తెలుగు వెలుగు తరపున సంక్రాంతి కానుకలు అందజేసిన అల్లింగం రాజశేఖర్