December 25, 2024

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమంలో జగన్మాత ఈశ్వరీ దేవి ఆరాధన గురుపూజ మహోత్సవం

చెన్నై న్యూస్: కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మనుమరాలు జగన్మాత ఈశ్వరీ దేవి సజీవ సమాధి అయిన రోజును పురస్కరించుకుని చెన్నై కొరట్టూర్ , వాటర్ కెనాల్ రోడ్డు లో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమంలో జగన్మాత ఈశ్వరీ దేవి ఆరాధన గురుపూజ మహోత్సవం 2024 జనవరి 5వ తేదీ శుక్రవారం వైభవంగా జరిగాయి.ఆశ్రమ ట్రస్టీలు తాతోలు వీరభద్రరావు ,నూతక్కి కిషోర్ , కాశీ సీతారామ శర్మల సామర్ధ్యంలో ఈ పూజలు ఏర్పాటు అయ్యాయి.ముందుగా వీరబ్రహ్మేంద్రస్వామి వారికి మహాహారతి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కాలజ్ఞాని జగన్మాత ఈశ్వరీ దేవి చిత్ర పటాన్ని పూలతో అలంకరించి 108 మంది మహిళలు పాల్గొని అమ్మవారిని కీర్తిస్తూ సామూహిక దీప పూజ భక్తిశ్రద్ధలతో చేశారు. పండితులు దీపపూజ విశిష్టతను తెలియజేశారు. అలాగే జగన్మాత ఈశ్వరీ దేవి జీవిత చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికి ఆలయ నిర్వాహకులు అన్నదానం చేశారు. ప్రసాద వినియోగంతో పాటు అమ్మవారి ఆశీస్సులు అందించారు.

About Author