చెన్నై న్యూస్:నగరానికి చెందిన శ్రేష్ట సేవా సంఘం ఆధ్వర్యంలో చెన్నై షావుకారుపేట ,తాతా ముత్తయప్పన్ వీధిలో సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ సీతారామ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీ సీతారాములకు తిరుమంజనం పూజలు కనుల పండువుగా నిలిచింది.జనవరి 28వ తేదీ ఆదివారం ఉదయం తిరుమంజనం పూజలు శాస్త్రోక్తంగా చేశారు. ముందుగా ఆలయ ప్రాంగణాన్ని పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.ఉదయం 9 గంటలకు శ్రీ సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామివార్లకు తిరుమంజనం ,ఉదయం 10 గంటలకు నూతన పట్టువస్త్రాల సమర్పణ, ఉదయం 10.30 గంటలకు అలంకారం, ఉదయం 11 గంటలకు హనుమంత పారాయణం, మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు తీర్థప్రసాదాల వితరణ వైభవంగా నిర్వహించారు. వివిధ నదీ జలాల, పంచామృతాలతో శ్రీ సీతారాములకు నిర్వహించిన అభిషేకం ఆధ్యంతం భక్తులను భక్తి పారవరవశ్యంలో నింపింది.భక్తుల రామనామ స్మరణలతో ఆలయం మార్మోగింది.అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకొని శ్రేష్ట సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జిల్లా సతీష్ కుమార్, కార్యదర్శి ఉప్పుటూర్ రవిచంద్రన్, కోశాధికారి కొత్తమాసి జయకుమార్ ల పర్యవేక్షణలో జరిగిన ఈ పూజలకు చేశారు.ఈ పూజలకు ముఖ్యఅతిథిగా శేఖర్ ఆటోస్ -ట్రిప్లికేన్ మేనేజింగ్ డైరెక్టర్ జయవరం చంద్రశేఖర్ పాల్గొన్నారు. అలాగే ఈ తిరుమంజనం పూజలకు శ్రీ సీతారాములకు నూతన వస్త్రాలను నగరానికి చెందిన నియో మెడీ స్పిక్స్ డెక్స్ బయో ఫార్మా ప్రయివేటు లిమిటెడ్ , శ్రీ విఘ్నేశ్వర ప్రింటర్స్ అధినేత చెలవారి వెంకట సుబ్బారావు కుటుంబం అందించారు.ఈ కార్యక్రమంలో శ్రేష్ట సేవా సంఘం వ్యవస్థాపకులు గ్రంధ లక్ష్మీ శేఖర్ , డాక్టర్ టి.మోహనశ్రీ , బోర్డు సభ్యులు, వలంటరీలు, ఆలయ ఇన్ చార్జీ శ్రీధర్ తదితరులు పాల్గొని సీతారాములను భక్తిశ్రద్ధలతో సేవించుకున్నారు.
ఈ సందర్భంగా శ్రేష్ట సేవా సంఘం తరపున ఆలయ ప్రాంగణంలో 500 మంది పేదలకు అన్నదానం చేశారు.అయోధ్య రామమందిరం ప్రారంభం కావటం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసిన నిర్వాహకులు సంఘం చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను తెలియజేశారు. ఈ సంఘం సేవలను పలువురు మహిళలు, ప్రముఖులు కొనియడారు.
More Stories
Successful Completion of the “STOP and WATCH” Road Safety Awareness Campaign by VS Hospitals and Chennai Traffic Police
ఘనంగా నరసింహ నగర్ కెనాల్ తెలుగు బాప్టిస్టు సంఘం 50వ వార్షికోత్సవ వేడుకలు
సూర్యకాంతం నటన అనితరసాథ్యం- నటి పద్మిని వ్యాఖ్య