December 25, 2024

సదరన్ ఇండియా వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

చెన్నై న్యూస్:చెన్నై జార్జిటౌన్, గిడ్డంగి వీధిలో ఉన్న 119 సంవత్సరాల చరిత్ర కలిగిన సదరన్ ఇండియా వైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. అసోసియేషన్ అధ్యక్షులు, అజంతా గ్రూప్ అధినేత అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకరరావు సారథ్యంలో ఏర్పాటైన కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా సుగుణ విలాససభ ఉపాధ్య క్షులు ఎస్ బి వెంకటరమణ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. సదరన్ ఇండియా వైశ్య అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఎం.నరసింహులు స్వాగతం పలికి ముఖ్య అతిధిని సభకు పరిచయం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథి ఎస్ బి వెంకటరమణ
ను ఘనంగా సత్కరించారు.ముందుగా అజంతా డాక్టర్ కే.శంకర్ రావు మాట్లాడుతూ సదరన్ ఇండియా వైశ్య సంఘం తరపున గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి సందర్భాల్లో దేశానికి స్వాతంత్ర్యం సంపాదించిన పెట్టిన మహనీయులు స్మరించుకోవటం మనకర్తవ్యం అని వ్యాఖ్యానించారు . అలాగే ఈ నెల 22 న అయోధ్య రామాలయం ప్రారంభం కావటం దేశానికే గర్వకారణంగా నిలిచిందన్నారు . ప్రపంచంలోని ప్రతీ ఒక్కరూ భాషలకు , మతాలకు అతీతంగా రామ నామాన్ని స్మరించుకుంటున్నారని తెలిపారు.ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు అయోధ్య రామాలయం కోసం కృషి చేసిన వారందరికీ సదరన్ ఇండియా వైశ్య సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.అనంతరం సంయుక్త కార్యదర్శి ఎం నరసింహులు మాట్లాడుతూ సదరన్ ఇండియా వైశ్య సంఘం తరపున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యంగా విద్యార్థులకు స్కాలర్ షిప్ లు , అన్నదానం , చరమ సంస్కారం, ఉచిత సామూహిక వివాహాలు చేస్తున్నట్టు తెలిపారు .గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నామని సభ్యులంతా అధిక సంఖ్యలో పాల్గొని దేశ నాయకులను స్మరించుకోవటం ఆనందంగా ఉందన్నారు.ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎస్ బి వెంకటరమణ మాట్లాడుతూ 119 సంవత్సరాలుగా సదరన్ ఇండియా వైశ్య సంఘం సమాజ సంక్షేమం కోసం పాటుపడటం ముదావహం అని కొనియాడారు. ఈ సంఘానికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా అతిధి ఎస్ బి వెంకట రమణను సంఘం
అధ్యక్షుడు అజంతా శంకరరావు , సభ్యులు కలసి సత్కరించారు. వందన సమర్పణను కోశాధికారి పెసల రమేష్ చేశారు. మరో సంయుక్త కార్యదర్శి పువ్వాడ అశోకు మార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రార్ధనగీతాన్ని మన్నారు ఉదయ్ కుమార్ ఆలపించారు.ఈ కార్యక్రమంలో జిపివి సుబ్బారావు, తాత నిరంజన్ , కాశీ విశ్వనాధం, కోటా గాయత్రి, పేర్ల బద్రి నారాయణ, కె కె త్రినాధ్ తదితర సభ్యులు పాల్గొన్నారు.

About Author