December 23, 2024

సీతారామనగర్ లో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం

చెన్నై న్యూస్:ఉత్తర చెన్నై కొడుంగైయూర్ సమీపంలోని సీతారామనగర్ లో ఉన్న సీతారామనగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని సంఘ కార్యాలయ ప్రాంగణంలో కనుల పండువుగా నిర్వహించారు. కళ్యాణోత్సవ వేదికపై పి సి రమేష్ బాబు – సుధ దంపతులు, వి మహేష్-నందిని దంపతులు, కె.సంతోష్ కుమార్ -మోనిక దంపతులు కూర్చొని వివాహాన్ని జరిపించారు .ఈ వేడుకల్లో ముందుగా సంఘ అధ్యక్షులు B.సురేష్ బాబు, కార్యదర్శి P. లక్ష్మణరావు, కోశాధికారి D.పిచ్చేశ్వరరావు, ఉపాధ్యక్షులు S.చంద్రశేఖర్ రెడ్డి, A.దుర్బా ప్రసాద్, సంయుక్త కార్యదర్శులు K.శ్రీనివాస కుమార్, B.శ్రీ ధర్, కమిటీ సభ్యులు J.మధుసూధనరావు, P.బాలాజీ, C.S. జయకుమార్, T.నాగరాజు, D.సాంబశివరావు, N. సతీష్ కుమార్, P. సుబ్బరాజు, D.వినోద్ కుమార్ లు తమ కుటుంబసభ్యులతో కలసి సీతారాములను పురవీధుల్లో ఊరేగించారు.శ్రీరామ నామాన్ని జపిస్తూ సాగిన ఊరేగింపు ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.అనంతరం సంఘ భవనంలో రమేష్ పండితులు బృందం సీతారాముల కల్యాణ క్రతువుని వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి సీతారాముల కల్యాణాన్ని తిలకించి తరించారు. భక్తులకు వడ పప్పు, పానకం, ప్రసాదాలు పంపిణీ చేశారు .అలాగే తెలుగు వంటకాలతో విందు ఏర్పాటుచేశారు.ఈ వంటకాలను సంఘ సభ్యులే గత 26 సంవత్సరాలుగా స్వచ్చందంగా ముందుకు వచ్చి తెలుగింటి వంటకాలను తయారు చేసి అందించటం విశేషం.శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 19 వ తేదీ వరకు ప్రతీరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి సీతారాములను కీర్తిస్తూ భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

About Author