May 3, 2024

శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

చెన్నై న్యూస్:జై శ్రీరామ్… జై శ్రీరామ్.. జయ జయ రామ్ అంటూ శ్రీరామ నామ స్మరణల నడుమ చెన్నై కొరట్టూర్ అగ్రహారంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 35వ వార్షిక సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలకు స్రవంతి అధ్యక్షులు J M నాయుడు అధ్యక్షత వహించారు. వేడుకల్లో ముందుగా ఉదయం 7 గంటలకు ఆలయంలోని మూలవిరాట్ ఉత్సవ మూర్తులకు నేత్రపర్వంగా అభిషేకాలను, హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు .అనంతరం ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా కళ్యాణ వేదికకు తీసుకొచ్చారు. వేదికపై సీతారామ ,లక్ష్మణ ,ఆంజనేయ స్వామి వార్లను విశేషంగా అలంకరించి శ్రీ సీతారాముల కళ్యాణ క్రతువుని వైభవంగా నిర్వహించారు . పెళ్లి పెద్దలుగా ద్రవిడ దేశం అధ్యక్షులు వి.కృష్ణారావు దంపతులు , దామోధరన్ దంపతులు , నిరంజన్ కుమార్ దంపతులు , గోపాల కృష్ణ దంపతులు, భాస్కర రావు దంపతులు కూర్చొని వివాహం జరిపించారు. అర్చకులు సుసర్ల కుటుంబ శాస్త్రి బృందం నేతృత్వంలో మాంగల్య ధారణ వైభవంగా జరిగింది. జై శ్రీరామ్… జై శ్రీరామ్ అంటూ శ్రీరామనామ స్మరణలతో కోదండ రామాలయం మారుమ్రోగింది. భద్రాద్రిలోని సీతారాముల కల్యాణాన్ని తలపించేలా ఆంధ్ర కళా స్రవంతిలోనూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవ వేడుక ప్రత్యేక శోభను సంతరించుకుంది. అనంతరం భక్తులకు ఆంధ్ర రుచులతో భోజనాలను అన్నప్రసాదంగా అందించారు ప్రత్యేకించి వడపప్పు ,పానకం ,మజ్జిగలను దాదాపు 1500 మంది భక్తులకు అందించారు అలాగే సాయంత్రం ఆలయంలో చెన్నై లోని వివిధ మహిళా బృందాలు పాల్గొని భక్తి పాటలు తో వీణులవిందు చేశారు ప్రత్యేకించి శ్రీ సీతా రాములను కీర్తిస్తూ ఆలపించిన పాటలు అందరినీ పరవశింప చేశాయి .వేడుకల్లో భాగంగా ఏప్రిల్ 18 వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు పైగా శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం జరుగుతుందని ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జె ఎం నాయుడు తెలిపారు. కల్యాణోత్సవ వేడుకల ఏర్పాట్లను స్రవంతి అధ్యక్షులు జె ఎం నాయుడు, సలహాదారు M .S. మూర్తి ,. ప్రధాన కార్యదర్శి J . శ్రీనివాస్ ,కోశాధికారి G V రమణ, ఉపాధ్యక్షులు V N హరినాథ్ , పి సరస్వతి, K.N. సురేష్ బాబు ఇతర సభ్యులు పర్యవేక్షించారు.



About Author