చెన్నై న్యూస్: దక్షిణ ఇండియా వైశ్య సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ పి వి కృష్ణా రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. సంఘ అధ్యక్షులు అజంతా అధినేత డాక్టర్ కనిగలుపుల శంకర రావు స్వాగతం పలికి, ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు. సంయుక్త కార్యదర్శిలు మద్ది నరసింహులు, పువ్వాడ అశోక్ కుమార్, కోశాధికారి పెసలు రమేష్, ఉపాధ్యక్షులు మన్నారు ఉదయ్ కుమార్, కాశీ విశ్వనాథంతో పాటు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సమాజ సేవలో ఆర్య వైశ్యులు ఎప్పుడూ ముందుంటారని పొన్నూరి వెంకట కృష్ణారావు అభిప్రాయపడ్డారు.
78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చెన్నై పుళల్ కావంగరై తెలుగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షులు జి.వి.రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం అందరికీ మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో చెన్నై పుళల్ కావంగరై తెలుగు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు లయన్ జి. మురళి, సెక్రెటరీ పి. నరసింహా రావు, కోశాధికారి మునుస్వామి, సంఘ సభ్యులు, తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.జాతీయ గీతాలను ఆలపించారు.
చెన్నై వేపేరిలోని తల్లి సంఘంగా పిలవబడుతున్న మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్టు చర్చి ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను కోలాహలంగా జరుపుకున్నారు.చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను
సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్. S.రాజేంద్రప్రసాద్ ఎగురవేశారు. ప్రపంచంలోని ప్రజలంతా శాంతి సమాదానాలతో జీవించాలని ప్రత్యేకంగా ప్రార్ధించారు.ఇందులో సంఘ చైర్మన్ జి.రామయ్య, సెక్రటరీ పోతల ప్రభుదాస్ ,కోశాధికారి ఏ.బాబు, ఇంకా దైవ సేవకులు ,విశ్వాసులు విచ్చేశారు. చాక్లెట్లు పంచిపెట్టి,దేశభక్తి గీతాలను ఆలపించారు.తోటి మానవుణ్ణి మానవత్వపు విలువలతో గౌరవించాలని రెవరెండ్ డాక్టర్ S. రాజేంద్రప్రసాద్ సూచించారు.
….
More Stories
సూర్యకాంతం నటన అనితరసాథ్యం- నటి పద్మిని వ్యాఖ్య
உலக தியான தினம் குறித்த முக்கிய உரை நாளை இந்திய நேரப்படி இரவு எட்டு மணி அளவில் நிகழ்த்த உள்ளது
NATIONAL OPEN ROTARY PARA TABLE TENNIS TOURNAMENT – SEASON3