December 23, 2024

పుట్టిన రోజున డాక్టర్ ఏ వీ శివకుమారి అనాథ వృద్ధులకు, పేదలకు అన్నదానం, సాయం

చెన్నై: తెలుగు ప్రముఖురాలు, సామాజిక సేవకురాలు లయన్ డాక్టర్ ఏవీ శివకుమారి తన 62వ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని పలు సంక్షేమ సహాయకాలు అందించారు .తొలుత చెన్నై కోడంబాక్కంలో ఉన్న అన్నై ఇల్లం వృద్ధాశ్రమంలో వందమందికి పైగా వృద్ధులకు సెప్టెంబర్ 13వ తేదీ బుధవారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందజేశారు. అలాగే మనవాళనగర్లో వున్న ‘హోం ఫర్ రిహాబిలిటేషన్ యూనివర్శల్ చారిటబుల్ ట్రస్ట్ కు చెందిన 150 మంది బాలబాలికలకు నిత్యావసర సరకులకు విరాళంగా రూ.5,000 నగదును అందించారు. అంతేగాక ముగ్గురు డయాలసిస్ రోగులకు గాను ప్రతినిధి కల్యాణి నాగరాజ్ కి రూ. 2,000 నగదు సాయం చేశారు. ఈ సందర్భంగా శివకుమారి మాట్లాడుతూ ప్రతీ పుట్టిన రోజును పేద ప్రజలు, వృద్ధులు నడుమ జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది అని అన్నారు.

About Author