December 26, 2024

శ్రీ ఆంధ్ర కళా స్రవంతిలో వైభవంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత పూజలు

చెన్నై న్యూస్ :చిత్రా పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు . చెన్నై కొరట్టూర్ అగ్రహారంలోని శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో ఉన్న ఆంధ్ర కళా స్రవంతి హాలులో ఈ వేడుకలను మంగళవారం సాయంత్రం నిర్వహించారు .ప్రముఖు పండితులు సుసర్ల కుటుంబ శాస్త్రి నేతృత్వంలో శ్రీ స
త్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని సత్యనారాయణ స్వామి వారి చిత్రపటాన్ని ఉంచి భక్తిశ్రద్ధలతో పూజలను చేశారు . భక్తులందరికి పూజకు సంబంధించిన పూజా సామాగ్రీనంతా ఆంధ్ర కళా స్రవంతి వారే అందించారు.ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వారిని భక్తితో వేడుకున్నారు .ఈ పూజా కార్యక్రమానికి ప్రముఖ ఆర్కిటెక్ట్ బి ఎన్ గుప్తా కుటుంబం స్పాన్సర్ గా వ్యవహరించారు.ఈ వేడుకల్లో ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జె ఎం నాయుడుతో పాటు సెక్రెటరీ జె. శ్రీనివాస్ ,కోశాధికారి జీవీ రమణ, సలహాదారుల మూర్తి ,ఇంకా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు . వేడుకల్లో ఆంజనేయస్వామి జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలతో ఆంజనేయ స్వామివారిని వేడుకున్నారు. పూజల్లో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి ప్రసాదాలను అందించారు.ఈ సందర్భంగా జె ఎం నాయుడు మాట్లాడుతూ ప్రతీ నెలా పౌర్ణమి రోజున తమ స్రవంతి తరపున శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నామని ,ఈ పూజల్లో నగరంలోని అందరూ పాల్గొంటున్నారని తెలిపారు.మరింతమంది ఈ పూజల్లో పాల్గొని సత్యనారాయణ స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు.

About Author