December 24, 2024

మద్రాసు మిర్చి వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

చెన్నై న్యూస్ : చెన్నై షావుకారుపేట రామకృష్ణ వీధిలోని మద్రాసు మిర్చి వర్తక సంఘంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు S. శివకుమార్, కార్యదర్శి M. చెన్నకేశవులు,
ఉపాధ్యక్షుడు S K హిమామ్ భాషా, జాయింట్ సెక్రటరీలు V.ధనుంజయ నాయుడు, ఎస్.సెంథిల్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సంఘ సలహాదారులు M.మాధవయ్య పాల్గొని త్రివర్ణ పతాకం ఎగురవేశారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు నివాళు లర్పించారు. ఈ వేడుకల్లో సలహాదారులు S.బాలసుబ్రమణ్యం, కమిటీ సభ్యులు N.జనార్ధన్, S.రమేష్, V.మధుసూధన్, M. చెంబుబాబు, P. మురళి, ఒ.చంద్రశేఖర్, పి.దశయ్య , అకౌంటెంట్ రమేష్ తదితరులు పాల్గొని జెండా వందనం చేశారు.జాతీయ గీతాన్ని, దేశభక్తి గీతాలను అలపించి అందరికీ చాక్లెట్లు పంచిపెట్టారు

About Author